Begin typing your search above and press return to search.

అలాంటి ఛాన్స్ ఇచ్చినా చాలంటున్న ఇల్లి బేబ్..?

బాలీవుడ్ లో కొన్నాళ్లు అది కూడా అంతంతమాత్రంగానే కెరీర్ సాగించిన ఇలియానా మళ్లీ తిరిగి సౌత్ సినిమాలు చేయాలని అనుకున్నా ఇక్కడ వారు ఛాన్సులు ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 2:30 AM GMT
అలాంటి ఛాన్స్ ఇచ్చినా చాలంటున్న ఇల్లి బేబ్..?
X

సౌత్ సినిమాలతో స్టార్ డం తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లడం చాలా మంది హీరోయిన్స్ కి కామనే. ఐతే సౌత్ సినిమాలతోనే కెరీర్ మొదలు పెట్టి ఇక్కడ స్టార్ డం తెచ్చుకుని ఇక్కడ ఆఫర్లు వస్తున్నా కాదని బాలీవుడ్ వెళ్లిన అతి తక్కువ మందిలో ఇలియానా ఒకరని చెప్పొచ్చు. గోవా బ్యూటీ ఇలియానాకు తెలుగు సినిమాలే సూపర్ ఫాలోయింగ్ క్రేజ్ వచ్చేలా చేశాయి. అయితే అలాంటి పరిశ్రమలో ఛాన్సులు వస్తున్నా బాలీవుడ్ లో ఆఫర్ రాగానే అక్కడికి జంప్ అయ్యింది. బాలీవుడ్ లో కొన్నాళ్లు అది కూడా అంతంతమాత్రంగానే కెరీర్ సాగించిన ఇలియానా మళ్లీ తిరిగి సౌత్ సినిమాలు చేయాలని అనుకున్నా ఇక్కడ వారు ఛాన్సులు ఇవ్వలేదు.

ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమాలను కొనసాగించాల్సింది అని అమ్మడు అభిప్రాయ పడిన సంగతి తెలిసిందే. ఒక బిడ్డకు తల్లైనా సరే ఇప్పటికీ తాను సినిమాలు చేసేందుకు సిద్ధం అంటుంది ఇలియానా. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఇలియానా ఇక్కడ రీ ఎంట్రీ ఇవ్వాలని కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా వర్క్ అవుట్ అవ్వట్లేదు. ఎలగైనా సరే టాలీవుడ్ ఛాన్స్ అందుకోవాలని చూస్తుంది ఇల్లి బేబ్.

హీరోయిన్ గా కాకపోయినా స్పెషల్ సాంగ్ లో అయినా చేసేందుకు రెడీ అనేస్తుంది అమ్మడు. పారితోషికం విషయంలో పట్టింపులు లేవి బోల్డ్ గా కూడా కనిపించేందుకు రెడీ అనేస్తుంది. ఐతే ఆమధ్య బీచ్ సైడ్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన ఇలియానా ప్రస్తుతం తన బాబుతో ఎంచక్కా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అమ్మడు మళ్లీ తిరిగి సినిమాలు చేయాలని బలంగా కోరుకుంటుంది. ఐతే స్టార్ హీరోయిన్ గా చేసిన ఆమెను తీసుకొచ్చి సైడ్ రోల్స్ ఇస్తే బాగోదు కదా అని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

అందుకే ఇలియానా స్పెషల్ సాంగ్స్ కి ఓకే అంటుంది. అమ్మడి కెరీర్ మళ్లీ గాడిన పడాలంటే ఒక్క సాంగ్ అది కూడా స్టార్ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ పడాలి. ఇలియానా అనగానే పోకిరి వైబ్స్ గుర్తొచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారి కోసమైనా ఇల్లి బేబిని మరోసారి టాలీవుడ్ కి తీసుకు రావాలని అనుకుంటున్నారు. మరి ఇలియానాకు ఏ స్టార్ ఛాన్స్ ఇస్తారన్నది చూడాలి. ఈసారి అవకాశం వస్తే మాత్రం తన టాలెంట్ మొత్తం చూపించాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.