Begin typing your search above and press return to search.

ఇలియానా ఎన్నాళ్లకెన్నాళ్లకు..?

ఐతే ఆ తర్వాత మళ్లీ సౌత్ సినిమాల్లో నటించాలని చూసినా కుదరకపోవడంతో పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టింది.

By:  Tupaki Desk   |   18 Jun 2024 3:57 AM GMT
ఇలియానా ఎన్నాళ్లకెన్నాళ్లకు..?
X

సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ వెళ్లి అక్కడ ఫేడవుట్ అయిన భామలు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో చెప్పుకుంటే ముందు వరుసలో ఉంటుంది గోవా బ్యూటీ ఇలియానా. మోడల్ గా చేస్తూ దేవదాస్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఐతే సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న టైం లోనే బాలీవుడ్ వెళ్లిన ఇల్లీ బేబ్ అక్కడ మొదట్లో ఛాన్సులు వచ్చినా తర్వాత సీన్ మారిపోవడంతో డీలా పడింది.

ఐతే ఆ తర్వాత మళ్లీ సౌత్ సినిమాల్లో నటించాలని చూసినా కుదరకపోవడంతో పర్సనల్ లైఫ్ మీద దృష్టి పెట్టింది. ఇదే క్రమంలో ఒకరితో ప్రేమలో పడి పెళ్లి దాకా వెళ్లిన ఇలియానా అతని నుంచి దూరమైంది. ఈమధ్యనే ఒకరిని పెళ్లాడి బిడ్డకు జన్మనిచ్చింది. ఐతే ఇప్పటికీ అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తుంది ఇలియానా.

రీసెంట్ గా అమ్మడు దో ఔర్ దో ప్యార్ సినిమాలో నటించింది. ప్రతీక్ గాంధీ, విద్యా బాలన్ తో పాటుగా ఇలియానా కూడా సినిమాలో భాగమైంది. ఈ సినిమాను షిర్షా గుహ ఠకుర్త డైరెక్ట్ చేశారు. ఆమె డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇదే. ఏప్రిల్ లో థియేట్రికల్ రిలీజైన ఈ మూవీ అక్కడ సోసోగానే రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐతే ఈ సినిమా లేటెస్ట్ గా ఓటీటీ రిలీజ్ అయ్యింది. డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రమోషన్స్ లో మళ్లీ వార్తల్లో నిలిచింది ఇలియానా.

చాలాకాలం తర్వాత సినిమా అప్డేట్స్ తో వార్తల్లో నిలవడం ఇదే అని చెప్పొచ్చు. దో ఔర్ దో ప్యార్ సినిమాతో ఇలియానాకు మరింత పబ్లిసిటీ ఏర్పడిందని చెప్పొచ్చు. అమ్మడు మళ్లీ తెలుగు ఆఫర్ల కోసం ఎంతగానో ట్రై చేస్తున్నా మన వాళ్లు మాత్రం ఆ అవకాశం ఇవ్వట్లేదు. బాలీవుడ్ లో మాత్రం వచ్చిన ఏ కొద్ది అవకాశాన్ని వదిలి పెట్టకుండా చేస్తూ వస్తుంది ఇల్లీ బేబీ. సినిమాల పరంగా సౌత్ ఆడియన్స్ కు దూరంగా ఉన్నా సరే ఇలియానాని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్. మళ్లీ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న ఇలియానాకి ఎవరు ఛాన్స్ ఇస్తారన్నది చూడాలి.