Begin typing your search above and press return to search.

ప్రభాస్ హను హీరోయిన్.. డ్యాన్స్ లో ఇరగదీసేలా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవం శనివారం ఉదయం జరిగింది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 4:41 PM GMT
ప్రభాస్ హను హీరోయిన్.. డ్యాన్స్ లో ఇరగదీసేలా..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమా ప్రారంభోత్సవం శనివారం ఉదయం జరిగింది. బిగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారు. 1940ల కాలంలోని హిస్టారికల్ ఫిక్షనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంట. సినిమా ప్రారంభోత్సవంలో బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా నటించబోయే హీరోయిన్ కూడా లాంచింగ్ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. హను రాఘవపూడి సినిమాలలో హీరోయిన్ పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంటుంది.

పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ని హను రాఘవపూడి డిజైన్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందాల రాక్షసి నుంచి సీతారామం వరకు ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ పాత్రలని హను రాఘవపూడి గొప్పగా రిప్రజెంట్ చేస్తాడు. అందుకే ప్రభాస్ తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేశారనే క్యూరియసిటీ అందరిలోనూ కలిగింది.

ఇక ఈ చిత్రంలో ఇమాన్వి అనే ఓ కొత్త అమ్మాయిని హను రాఘవపూడి హీరోయిన్ పరిచయం చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు. ఆ అమ్మాయి ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో ఇంతకి ఎవరా బ్యూటీ అని సినీ ప్రియులు, డార్లింగ్ ఫ్యాన్స్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. పాకిస్తాన్ కు చెందిన అమ్మాయి అయినప్పటికీ చాలా కాలంగా ఢిల్లీ లో ఉంటున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ కోసం హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు అనగానే ఒక్కసారిగా ఇమాన్వి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఇమాన్వి సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది. అలాగే యాక్టర్ గా కూడా కెరియర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తోంది. ఆమె కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తుందని ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ బట్టి తెలుస్తోంది. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో ఆమె డాన్స్ వీడియోలు చాలా ఉన్నాయి.

క్లాసికల్, వెస్ట్రన్ డాన్స్ లతో షార్ట్ వీడియోలు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటుంది. మంచి ఎక్స్ ప్రెషన్స్ తో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తోంది. ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్సర్ గా అమ్మడికి మంచి గుర్తింపు ఉంది. 1940 బ్యాక్ డ్రాప్ కాబట్టి తప్పకుండా ఆ టైమ్ కు తగ్గట్టుగా అమ్మడు తన డ్యాన్స్ తో మెప్పించే అవకాశం ఉంది.

ఆమె వీడియోలు చూస్తుంటే మంచి టాలెంటెడ్ డ్యాన్సర్ అనిపిస్తుంది. అందుకే హను రాఘవపూడి ఏరికోరి ప్రభాస్ కి జోడీగా ఇమాన్విని ఎంపిక చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఫైనల్ గా అమ్మడు కెరీర్ ఆరంభ దశలోనే పాన్ ఇండియన్ నెంబర్ స్టార్ తో నటించే ఛాన్స్ అందుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ప్రభాస్ కి జోడీగా నటించడానికి చాలా మంది స్టార్ హీరోయిన్స్ పోటీ పడుతూ ఉంటారు. వారందరిని దాటుకొని ఆ అవకాశం ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ ని వరించింది. మరి అమ్మడు తన పెర్ఫెమెన్స్ తో ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.