ఇమాన్వి.. ప్రభాస్ కోసం కాస్ట్లీ కండిషన్స్!?
అయితే దర్శకులు మాత్రం ఆయనతో చేస్తోన్న సినిమా షూటింగ్స్ మొదలెట్టేస్తున్నారు. ప్రభాస్ లేని సన్నివేశాలని ముందుగా తెరకెక్కించే పనిలో పడ్డారు.
By: Tupaki Desk | 27 Nov 2024 8:30 AM GMTడార్లింగ్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ఉండటం వలన ఏ సినిమాకి ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది క్లారిటీ లేదు. అయితే దర్శకులు మాత్రం ఆయనతో చేస్తోన్న సినిమా షూటింగ్స్ మొదలెట్టేస్తున్నారు. ప్రభాస్ లేని సన్నివేశాలని ముందుగా తెరకెక్కించే పనిలో పడ్డారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ నెల రోజుల క్రితమే హను మొదలుపెట్టారు.
తమిళనాడులో కీలక సన్నివేశాలు షూట్ చేశారు. ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకిదే మొదటి చిత్రం. హీరోయిన్ గా అరంగేట్రంతోనే ప్రభాస్ తో జతకట్టే ఛాన్స్ ని ఇమాన్వి సొంతం చేసుకుంది. అయితే అన్ని రకాల స్క్రీన్ టెస్ట్స్ చేసిన తర్వాత సినిమాలోని పాత్రకి ఆమె కరెక్ట్ గా సరిపోతుందని డిసైడ్ అయ్యి హను రాఘవపూడి ఇమాన్విని ఎంపిక చేసారని సమాచారం.
ఇదిలా ఉంటే ప్రభాస్ 2025 సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందంట. అప్పుడు కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ‘ఫౌజీ’ మూవీ కోసం ఇమాన్వితో మైత్రీ మూవీ మేకర్స్ ఏడాది డేట్స్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నారంట. ఈ ఏడాది కాలంలో ఎప్పుడు షూటింగ్ ఉన్న వెంటనే వచ్చేలా ఆమెతో ఒప్పంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అమెరికాలో ఉంటున్న ఇమాన్వి షూటింగ్ లో రావడానికి బిజినెస్ క్లాస్ జర్నీ, 5స్టార్ హోటల్ విడిది ఏర్పాటు చేయబోతున్నారంట. ప్రభాస్ ఎప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేస్తే అప్పుడు ఆమె షూటింగ్ కి రావాలని ఇమాన్వికి సూచించారని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ అది కూడా ప్రభాస్ లాంటి నెంబర్ వన్ స్టార్ తో జోడీగా మొదటి చిత్రమే చేసే అవకాశం అంటే సామాన్య విషయం కాదు.
ఈ అదృష్టం ఇమాన్వికి దక్కింది. అందుకే ‘ఫౌజీ’ తర్వాత తన కెరియర్ కూడా కంప్లీట్ గా మారిపోతుందని ఇమాన్వి భావిస్తోంది. అందుకే బల్క్ కాల్ షీట్స్ ని ఈ సినిమా కోసం కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఫౌజీ మూవీ హిట్ అయితే కచ్చితంగా తెలుగు, హిందీ భాషలలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించే ఛాన్స్ ఉంది. అలాగే వరుస అవకాశాలు కూడా రావొచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.