Begin typing your search above and press return to search.

ప్రభాస్- హను హీరోయిన్.. ఏం క్రేజ్ రా బాబు!

ఇమాన్వి.. కొన్ని గంటలుగా నెట్టింట ఎక్కడ చూసినా ఈ బ్యూటీ కోసమే చర్చ నడుస్తోంది. ఆమె డ్యాన్స్ వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   18 Aug 2024 4:30 PM GMT
ప్రభాస్- హను హీరోయిన్.. ఏం క్రేజ్ రా బాబు!
X

ఇమాన్వి.. కొన్ని గంటలుగా నెట్టింట ఎక్కడ చూసినా ఈ బ్యూటీ కోసమే చర్చ నడుస్తోంది. ఆమె డ్యాన్స్ వీడియోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి బ్యూటిఫుల్ పిక్స్ వేరే లెవెల్ లో ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా హ్యాండిల్స్ ఓపెన్ చేస్తే చాలు.. ఇమాన్వికి సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. తన డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఇమాన్వి. స్పెషల్ ఫ్యాన్ బేస్ దక్కించుకుంది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో రాబోతున్న హిస్టారికల్ లవ్ స్టోరీ మూవీ పూజా కార్యక్రమాలు నిన్న జరిగిన విషయం తెలిసిందే. 1940 వార్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో రూపొందనున్న ఈ సినిమాలో ఒక యోధుడి కథను ప్రజెంట్ చేయబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో మృణాల్ ఠాకూర్ లేదా ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఓపెనింగ్ సెర్మనీ రోజు.. ఒక్కసారిగా అందరికీ కనిపించి షాక్ ఇచ్చింది ఇమాన్వి ఇస్మాయిల్.

మూవీ ఓపెనింగ్ సెర్మనీలో ప్రభాస్ తో కలిసి పిక్స్ కు పోజులిచ్చిన ఇమాన్వి.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె బ్యాక్ గ్రౌండ్ కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె డ్యాన్సింగ్ టాలెంట్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కు ఫిదా అవుతున్నారు. అమ్మడి స్మైల్ చాలా ఫ్రైష్ గా ఉందని చెబుతున్నారు. డార్లింగ్ ప్రభాస్ కు సరైన జోడీ దొరికిందని ఆయన ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫుల్ పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

అదే సమయంలో ప్రభాస్, ఇమాన్వి వీడియోలను క్రేజీగా ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు. ఇద్దరి జోడీ వేరే లెవల్ లో ఉందని చెబుతున్నారు. తెలుగులో ఈ జోడీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుందని అంటున్నారు. డార్లింగ్ స్టైల్ కు ఇమాన్వి అందం అండ్ అభినయం సమపాళ్లలో తోడైతే సినిమా అవుట్ పుట్ ఓ రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. సినీ నేపథ్యంలో లేని కుటుంబం నుంచి ఇప్పుడు టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఇమాన్విని ఆడిషన్స్ లో సెలెక్ట్ చేశారట హను రాఘవపూడి.

ఢిల్లీలో పుట్టిన ఇమాన్వి.. వెస్టన్, కూచిపూడి, భరతనాట్యంతో అదరగొడుతుంది. ట్రెండింగ్ సాంగ్స్ కు రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటుంది. సినీ ఎంట్రీ కన్నా ముందే కోట్లాది మంది హృదయాలు దోచుకుంది. ఒక్కరోజులోనే లక్షల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. నిన్న మార్నింగ్ కు ఆరు లక్షలు ఉన్న ఆమె ఫాలోవర్ల సంఖ్య.. ఇప్పుడు 7 లక్షలకు చేరుకుంది. మొత్తానికి తొలి ఛాన్స్ తోనే ఓవర్ నైట్ హీరోయిన్ గా మారింది. మరి మూవీ రిలీజ్ అయ్యాక బ్యూటీ క్రేజ్.. సినీ ఇండస్ట్రీలో ఎంతటి స్థాయికి పెరుగుతుందో వేచి చూడాలి.