Begin typing your search above and press return to search.

ప్రభాస్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన కొత్తమ్మాయి

ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి, అయితే తాజాగా మరొక ఆసక్తికర విషయమేమిటంటే ఈ సినిమాలో కథానాయికగా కొత్త హీరోయిన్ ఇమాన్ ఇస్మైల్ జోడి కట్టబోతోంది.

By:  Tupaki Desk   |   17 Aug 2024 11:08 AM GMT
ప్రభాస్.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన కొత్తమ్మాయి
X

ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన తాజా సినిమా 'హను రాఘవపూడి' దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్టు 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యానర్ పై అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి, అయితే తాజాగా మరొక ఆసక్తికర విషయమేమిటంటే ఈ సినిమాలో కథానాయికగా కొత్త హీరోయిన్ ఇమాన్ ఇస్మైల్ జోడి కట్టబోతోంది.

ఇమాన్ ఇస్మైల్ ఈ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టబోతోంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సరసన తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించడం ఒక గొప్ప అవకాశం. ఈరోజు చిత్ర లాంచ్ వేడుకలో ఆమె పాల్గొనగా, ఆమె పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె అందం, ప్రత్యేకత సినిమాకు ఒక ఆకర్షణగా మారుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

హను రాఘవపూడి, తన సినిమాలో హీరోయిన్లను ఎంత అందంగా, ప్రత్యేకంగా చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టులో కూడా ఇమాన్ ఇస్మైల్ పాత్రకు హను ఎలాంటి ప్రత్యేకత ఇస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం కాగానే ఇమాన్ ఇస్మైల్ పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది, ఇది ఆమె కెరీర్‌ కి మంచి ఆరంభం అనే చెప్పాలి.

ఈ చిత్రం 1940ల నాటి నేపథ్యంతో ఒక సైనికుడి కథను ఆధారంగా తీసుకుని రూపొందించబడుతోంది. అన్యాయాలకు ప్రతిగా యుద్ధం ద్వారా మాత్రమే సమాధానం దొరుకుతుందని నమ్మే ఒక సామాజిక వర్గం నుంచి ప్రభాస్ పోషిస్తున్న పాత్ర అవతరించనుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రంగా, ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్ ఇస్మైల్ నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విషాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక పీరియడ్‌ డ్రామాగా ఉండబోతోంది.

ప్రభాస్ అభిమానులు ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇమాన్ ఇస్మైల్ లాంటి కొత్త అమ్మాయి ప్రభాస్ కు జోడిగా సెలెక్ట్ కావడం కొత్తగా ఉంటుంది అని చెప్పవచ్చు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది. ఇక సినిమాను వచ్చే ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.