టాప్ 10లో శోభితకి 5వ స్థానం, సమంతకి 8వ స్థానం
అత్యధికంగా ఈ ఏడాది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో యానిమల్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రీ గురించి వెతికారు. అందుకే ఈమె నెం.1 స్థానంలో నిలవడం జరిగింది.
By: Tupaki Desk | 5 Dec 2024 8:30 PM GMTజాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంటర్‌టైన్మెంట్‌లో ప్రముఖ, జెన్యూన్ వెబ్ పోర్టల్‌గా చెప్పుకునే ఐఎండీబీ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఏ ఏడాది ఐఎండీబీ మోస్ట్ పాపులర్ టాప్ 10 జాబితాలో టాలీవుడ్ స్టార్స్‌కి చోటు దక్కింది. ఎక్కువ శాతం ముద్దుగుమ్మలకు ఇందులో చోటు దక్కింది. సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో సెర్చ్ ఆధారంగా ఈ జాబితాను ఐఎండీబీ రూపొందిస్తూ ఉంటుంది. అత్యధికంగా ఈ ఏడాది సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో యానిమల్ ముద్దుగుమ్మ త్రిప్తి డిమ్రీ గురించి వెతికారు. అందుకే ఈమె నెం.1 స్థానంలో నిలవడం జరిగింది.
యానిమల్ సినిమా వచ్చినప్పటి నుంచి త్రిప్తి గురించి నెటిజన్స్ తెగ వెతికేస్తూనే ఉన్నారు. పైగా ఆమె నటించిన మూడు బాలీవుడ్ సినిమాలు సైతం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండో స్థానంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఉన్నారు. ఆమె కల్కి తో పాటు పలు సినిమాల్లో నటించడం ద్వారా టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఇక మూడో స్థానంలో ఇషాన్ ఖత్తర్ నిలిచారు. ఆయనకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఆధరణ నేపథ్యంలో ఈ స్థానంను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక నాల్గవ స్థానంలో జవాన్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉన్నారు.
టాప్ 5లో తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ నిలిచారు. హిందీలో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటించడంతో పాటు, నాగ చైతన్యతో ప్రేమ వ్యవహారం ఇతర విషయాల కారణంగా నెటిజన్స్ ఆమె గురించి అత్యధికంగా వెతకడం జరిగింది. అందుకే ఆమెకు మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో 5వ స్థానం దక్కింది. ఆమె తర్వాత స్థానంలో శార్వరీ నిలిచింది. బాలీవుడ్‌లో వరుస సినిమాల కారణంగా ఈమెకు ఈ గుర్తింపు దక్కింది. ఏడవ స్థానంలో ఐశ్వర్య రాయ్ ఉన్నారు. ఎప్పటిలాగే తన అందమైన ఫోటోలు, ఈసారి భర్త నుంచి విడాకులు అంటూ వార్తలు వచ్చిన కారణంగా ఇంటర్నెట్‌లో ఈమె గురించి అత్యధికంగా సెర్చ్ చేయడం జరిగింది.
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు 8వ స్థానం దక్కింది. ఆమె పెద్దగా సినిమాలు చేయకున్నా కమర్షియల్ యాడ్స్, సోషల్ మీడియా ఫోటోలు, అనారోగ్య సమస్యల కారణంగా ఎప్పుడూ వార్తల్లో నిలవడంతో ఇంటర్నెట్‌లో సెర్చ్ అయ్యారు. చివర్లో సిటాడెల్ వెబ్ సిరీస్‌తో సందడి చేయడం జరిగింది. సమంత తర్వాత స్థానంలో ఆలియా భట్ నిలిచారు. హిందీలో ఈమె చేస్తున్న సినిమాలు, తల్లి కావడం, సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల కారణంగా 9వ స్థానంలో ఆలియా నిలిచారు. ఇక టాలీవుడ్ స్టార్ ప్రభాస్ 10వ స్థానంలో నిలిచారు. కల్కి, సలార్ సినిమాల కారణంగా గత ఏడాది కాలంగా ప్రభాస్ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్‌కి మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం.