నేనేం అందంగా ఉండను- సె*క్సీ కూడా కాదు : సామ్
కొద్దిరోజుల క్రితం మలేసియాలో ఓ నీటి కొలనులో జలకాలాడుతున్న పిక్స్ ను కూడా షేర్ చేసింది.
By: Tupaki Desk | 20 March 2024 2:30 AM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అయిన విషయం తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేసిన తర్వాత మూవీలకు లాంగ్ బ్రేక్ ఇచ్చింది. కొన్ని నెలల క్రితం మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డ సామ్.. ఖుషి తర్వాత విదేశాల్లో ఫుల్ రెస్ట్ తీసుకుంది. కొద్దిరోజుల క్రితం మలేసియాలో ఓ నీటి కొలనులో జలకాలాడుతున్న పిక్స్ ను కూడా షేర్ చేసింది. ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
తాజాగా సమంత ఇండియా టుడే కాన్ క్లేవ్ లో మాట్లాడింది. ఆ సమయంలో ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేసింది. అందుకు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. పుష్పలో ఊ అంటావా సాంగ్ చేసే టైమ్ లో తాను వణికి పోయినట్లు సమంత తెలిపింది. ఊ అంటావా పాట, ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర ఒకటేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
తాను ఎప్పుడూ అందంగా లేనని, సాధారణమైన అమ్మాయిల్లా అందంగా కనిపించాలనే ఆలోచనలతోనే పని చేశానని చెప్పింది సమంత. సె*క్సీ అనే పదం తనకు అస్సలు సరిపడదని తెలిపింది. కానీ అలాంటి అసౌకర్యమైన, కఠినమైన పరిస్థితి ఎదుర్కొంటూనే హీరోయిన్ గా వృద్ధి చెందుతూ వచ్చినట్లు పేర్కొంది. ఊ అంటావా లాంటి సాంగ్ ఇంకోసారి చేయనని, అందులోని లిరిక్స్ తనకొక ఛాలెంజ్ లాంటివని చెప్పుకొచ్చింది.
అయితే పుష్ప మూవీ వచ్చి రెండేళ్లు దాటిపోయింది. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. అందులోని పాటలు అయితే ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. వరల్డ్ వైడ్ గా పుష్ప సాంగ్స్ క్రేజ్ సంపాదించుకున్నాయి. ఊ అంటావా సాంగ్ అయితే వేరే లెవల్. ఆ పాటలోని లిరిక్స్ కూడా అందరికీ గుర్తుండిపోయాయి. సమంత వల్ల ఆ సాంగ్ అంత హిట్ అయిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
కానీ స్టార్ హీరోయిన్ అయిన సమంత.. ఆ సాంగ్ చేసినప్పుడు చాలా ట్రోల్స్ ఎదుర్కొంది. కొందరు ఆమె ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు. అంత పెద్ద హీరోయిన్.. ఇలాంటి సాంగ్ చేయడమేంటని సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు ఆమెను విమర్శిస్తూనే ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ పుష్ప-2 విడుదలవ్వనుంది. అయితే సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా మరికొద్ది రోజుల్లో స్ట్రీమింగ్ కానుంది.