పురాతన కట్టడాల్లో అవేం పనులండి?
ముఖ్యంగా త్రిప్తీ ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది.
By: Tupaki Desk | 18 Jun 2024 11:30 AM GMTత్రిప్తి దిమ్రీ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు లేడు. 'యానిమల్' విజయంతో అమ్మడు తెలుగింట బాగా పాపులర్ అయింది. కనిపించింది కాసేపే అయినా ఉన్నంత సేపు మెరింపించింది. రణబీర్ కపూర్ తో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది ఎనలేని గుర్తింపును దక్కించుకుంది. బాలీవుడ్ లో బాబి-2గా ఫేమస్ అయింది. ముఖ్యంగా త్రిప్తీ ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. ఆమె కొత్త సినిమాలు ఏంటి? అని నెట్టింట సెర్చ్ చేసే అభిమానులు పెరుగుతున్నారు.
ఇప్పటికే అమ్మడు కొన్ని సినిమాలకు కమిట్ అంయింది. అందులో ఒకటి 'భూల్ భులయ్యా-3'. ఇందులో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే సినిమా సెట్స్ కి వెళ్లింది. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ముంబై.. కోల్ కత్తా లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరిగింది. త్వరలో కొత్త షెడ్యూల్ మధ్యప్రదేశ్ లో ప్రారంభం అవుతుంది. ఇది సినిమాకి అత్యంత ప్రధానమైన షెడ్యూల్. అందుకు యూనిట్ సన్నధమవుతోంది.
ఎంపీలో చారిత్రాత్మక కట్టడాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. జులై వరకూ అక్కడే షూటింగ్ జరుగుతుందని సమాచారం. అయితే అక్కడే కార్తీక్-త్రిప్తీ మధ్య ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. పురాతన కట్టడాల మధ్య ఇంటిమేట్ సన్నివేశాలుంటే బాగుంటుందని దర్శకుడు అనీష్ బజ్మీ వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేసాడుట. వాటిని కేవలం ఇద్దరు ముగ్గురు సభ్యులు మధ్యనే షూట్ చేయనున్నారుట. దర్శకుడు, కెమెరా మ్యాన్, ఇద్దరు అసిస్టెంట్ ఉంటారని తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి సన్నివేశాల చిత్రీకరణ అంతా గోప్యంగా జరుగుతుంది. తెర మీద మాత్రం అందరూ చూసే విధంగా వెసులుబాటు ఉంటుంది. ఇదే నిజమతే త్రిప్తీ పేరు మళ్లీ మారు మ్రోగిపోవడం ఖాయం. అసలే అలాంటి సన్నివేశాల్లో త్రిప్తీ పెర్పార్మెన్స్ ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఓ బ్రాండ్ లా మారిపోతుందేమో.