సల్మాన్- హృతిక్‌లా కనిపించాలని స్టెరాయిడ్స్ తీసుకున్నా: ఇమ్రాన్ ఖాన్
ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ సడెన్ గా ఇండస్ట్రీ నుంచి అదృశ్యం అవ్వడంపై చాలా కథనాలు వైరల్ అయ్యాయి.
By: Tupaki Desk | 10 Aug 2024 12:30 PM GMTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ హిందీ చిత్రసీమలో నటుడిగా ఆరంగేట్రం చేయడం అటుపై కెరీర్ వైఫల్యం సహా డ్రగ్ అడిక్షన్ గురించి చాలా చర్చ సాగింది. వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలోను అతడు చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నాడు. భార్యకు విడాకులిచ్చిన ఇమ్రాన్ అటుపై నటి లేఖా వాషింగ్టన్ తో డేటింగ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ జంట ముంబైలోని ఓ సీఫేసింగ్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారని హిందీ మీడియా కథనాలు రాసింది.
ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ సడెన్ గా ఇండస్ట్రీ నుంచి అదృశ్యం అవ్వడంపై చాలా కథనాలు వైరల్ అయ్యాయి. కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాక అతడు స్టెరాయిడ్స్ కి అలవాటు పడ్డాడని కూడా ప్రచారం సాగింది. తాజాగా తన అలవాట్లు బానిసత్వం గురించి ఇమ్రాన్ మీడియాతో బహిరంగంగా మాట్లాడారు. చిత్రపరిశ్రమలో హీరోల నడుమ పోటీ గురించి తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి కూడా అతడు ఓపెనయ్యాడు. తాను సల్మాన్ ఖాన్, హృతిక్, సంజయ్ దత్ లా మంచి ఫిట్ బాడీ కావాలని భావించానని, దానికోసం స్టెరాయిడ్స్ కూడా ఉపయోగించానని తెలిపాడు.
హీరోగా ఇమేజ్ పెంచుకోవడం కోసం తపించాడు. కానీ స్టెరాయిడ్స్ తో వచ్చేది ఏదీ నిలకడలేనిది. `కట్టి బట్టీ` మూవీ ఫ్లాప్ అయిన తరువాత పూర్తిగా అతడు తన ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి పెట్టడానికి నటనకు దూరంగా ఉన్నానని తెలిపాడు. ముడతలు పడకుండా ఆకర్షణీయంగా ఉండాలని కథానాయికలు ప్రయత్నిస్తారు. ఇలాంటి భారం ఇప్పుడు పురుషులను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోందని ఇమ్రాన్ అన్నారు. అందాన్ని కాపాడుకోవడానికి కండర పటుత్వాన్ని ప్రదర్శించడానికి చాలా చేయాల్సి వస్తోందని అన్నాడు.
నిజానికి హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఇటు సౌత్‌లో కూడా విజృంభిస్తున్న సూపర్ హీరో ధోరణి వల్ల కూడా ఒత్తిడి పెరిగింది. ఇలాంటి ఒత్తిడి గురించి ఇమ్రాన్ బహిరంగంగా మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా మేకోమ్యాన్ రూపం కావాలనే తత్వం బలంగా పెరిగింది. ప్రత్యేకించి సినిమాలో సూపర్ హీరో జానర్ పెరగడంతో ఇది తీవ్రతరం అయిందని అన్నాడు. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి హీరోలు మ్యాకోమ్యాన్ రూపాలకు కేరాఫ్ గా మారారని, చాలా మంది ఇతర స్టార్లు దానిని అనుకరించాల్సిన అవసరం ఏర్పడిందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ప్రభావం ఈ ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసింది.
దీని నుంచి నటీనటులు ఎస్కేప్ అవ్వడానికి ఛాన్సే లేదు. బాలీవుడ్‌లో ప్రబలంగా ఉన్న సూపర్ హీరోయిక్ ఇమేజ్‌కి సరిపోయే ప్రయత్నంలో తాను స్టెరాయిడ్‌లను ఆశ్రయించానని ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నాడు. తన ప్రయత్నాలు ఎలా ఉన్నా కానీ.. తన శరీరం సహజంగా తెరపై ఆరాధించే సూపర్ హీరో లాంటి శరీరాకృతి కోసం నిర్మితమైనది కాదని గ్రహించినట్టు తెలిపాడు. ప్రమాణాలకు అనుగుణంగా ప్రయత్నించినప్పుడు స్టెరాయిడ్ల వాడకం నిలకడలేనిదని నిరూపణ అయింది. చివరికి అది సమస్యలను సృష్టించింది.
`కట్టి బట్టి` బాక్సాఫీస్ వైఫల్యం తర్వాత ఇమ్రాన్ ఖాన్ చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు. ఫిల్మ్ కంపానియన్‌తో ఒక చాటింగ్ సెషన్ లో.. నటనను విడిచిపెట్టాలనే తన నిర్ణయం.. తన వాస్తవ స్వరూపం నుండి అది డిస్‌కనెక్ట్ అయిందని భావించడం వల్లనే జరిగిందని అన్నాడు. నటన అనేది ఒక ఎంపిక అయితే, తన అంతర్గత పోరాటాలను పరిష్కరించడం సులభంగా జరగలేదని, నటనలో తన వృత్తిని కొనసాగించడం కంటే తన శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమైనదని భావించినట్టు తెలిపాడు.