అగ్ర నటి అతి నమ్మకంపై చెంప దెబ్బ
ఆ ఇద్దరు నటీమణులకు ప్రముఖ దర్శకుడు బ్లాక్ బస్టర్లు అందించాడు. అతడితో సెట్లో పని చేసే క్రమంలో అతడి అద్భుత ప్రతిభకు సదరు కథానాయికలు ఫిదా అయిపోయారు.
By: Tupaki Desk | 19 March 2025 8:51 AM ISTఆ ఇద్దరు నటీమణులకు ప్రముఖ దర్శకుడు బ్లాక్ బస్టర్లు అందించాడు. అతడితో సెట్లో పని చేసే క్రమంలో అతడి అద్భుత ప్రతిభకు సదరు కథానాయికలు ఫిదా అయిపోయారు. అవకాశం రావాలే కానీ, వెంటనే సినిమాకి ఓకే చెప్పేంత సాన్నిహిత్యం వారి మధ్య ఉంది. అయితే ఆ ఇద్దరు భామలతో కలిసి పని చేసిన అతడిని ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడుతుంది. ఆ ఇద్దరిలో ఎవరు బెస్ట్?.. ఎవరో ఒకరినే ఎంపిక చేసుకోవాల్సి వస్తే, ఎవరిని ఎంపిక చేసుకుంటారు? అని ప్రశ్నిస్తే.. అతడు వారిలోంచి ఒకరిని ఎంచుకున్నాడు.
ఈ ఎపిసోడ్ లో దర్శకుడు మరెవరో కాదు.. ఇంతియాజ్ అలీ. నటీమణులు దీపిక పదుకొనే, ఆలియా భట్. ఆ ఇద్దరిలో ఆలియాను అతడు ఎంపిక చేసుకున్నాడు. ఇంతియాజ్ అలీ `తమాషా`లో దీపికా పదుకొనేతో .. హైవేలో అలియా భట్‌తో కలిసి పనిచేశారు. ఈ రెండు చిత్రాలు ఫీల్ గుడ్ టాక్ తో రక్తి కట్టించాయి. ఆలియా, దీపిక అభిమానుల నడుమ ఫ్యాన్ వార్ గురించి తెలిసిందే.
దీపిక ప్రేమించిన స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ఆలియా ప్రేమించి పెళ్లాడింది. అందువల్ల అభిమానుల మధ్య అంతూ దరీ లేని కలతలు ఉన్నాయి. తాజాగా ఇంతియాజ్ అలీ ఓ ఇంటర్వ్యూలో అభిమానుల మధ్య వార్ ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో తమాషా షూటింగ్ సమయంలో తాను సురక్షితంగా కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్లు దీపిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. తాను -ఇంతియాజ్ గొప్ప జంట అని అతడికి ఇష్టమైన నటిని అని కూడా దీపిక చెప్పింది. అయితే ఇటీవల ఆ పాత వీడియో చూశాక.. దీపిక త్రోబ్యాక్ ప్రకటన ఇప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుందని.. ఆమె అతి విశ్వాసానికి చెంపదెబ్బ కొట్టినట్లు అనిపిస్తుందని ఆలియా అభిమానులు పేర్కొన్నారు. దీపిక- ఆలియా చాలా గ్యాప్ తర్వాత స్నేహంగా ఉన్నారు. వారి మధ్య అభిమానానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు గతలో వైరల్ అయ్యాయి.