Begin typing your search above and press return to search.

మినీ డ్రెస్ లో ఇనయా.. ఆ క్యాప్షన్ కు కారణమేంటో!

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మరింత పాపులారిటీ దక్కించుకున్న ఆమె.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది.

By:  Tupaki Desk   |   22 Dec 2024 4:08 AM GMT
మినీ డ్రెస్ లో ఇనయా.. ఆ క్యాప్షన్ కు కారణమేంటో!
X

బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన వీడియోతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ముద్దుగుమ్మ.. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మరింత పాపులారిటీ దక్కించుకున్న ఆమె.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటోంది.


ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ షేర్ చేసే ఇనయాకు వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. తన అందాల ఆరబోతతో మాయ చేసే అమ్మడు.. తన ఫాలోవర్స్ ను రోజురోజుకు పెంచుకుంటోంది. హీటు పుట్టించే పిక్స్ తో ఇనయా సందడి మాములుగా ఉండదు. సెగలు రేపే అందాలతో.. మైమరిపించే స్టిల్స్ తో ఓ రేంజ్ లో అలరిస్తుంటోంది అమ్మడు.


తాజాగా కొత్త పిక్స్ ను షేర్ చేసిన ఇనయా.. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. బ్లాక్ కలర్ మినీ డ్రెస్ వేసుకున్న బ్యూటీ.. క్రేజీ సెల్ఫీలను పోస్ట్ చేసింది. ఒక్కో పిక్.. ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో.. అదిరిపోయే అందంతో ఆకట్టుకుంటోంది. సింపుల్ గా చెప్పాలంటే.. తన పిక్స్ తో నెట్టింట హీటు పుట్టిస్తోంది ఇనయా.


"రెండు విషయాలు నేను మళ్ళీ అనుభవించకూడదనుకుంటున్నాను.. హార్ట్ బ్రేకెన్, డీప్ లవ్" అంటూ రాసుకొచ్చింది. దీంతో అమ్మడు క్యాప్షన్ వెనుక అర్థమేంటోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసింది అమ్మడు. జిమ్ ట్రైనర్‌ గౌతమ్ కొప్పిశెట్టితో లవ్ లో ఉన్నట్లు తెలిపింది.


గౌతమ్ దిగిన కొన్ని పిక్స్ షేర్ చేసి.. సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడు క్యాప్షన్ అలా పెట్టడంతో రీజన్ ఏంటోనని డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ ఫీల్డ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇనయా.. తక్కువ టైమ్ లో ఎక్కువ పాపులర్ అయింది. ఆ తర్వాత ఆమెకు మెల్లగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.


ఏవం జగత్ మూవీతో హీరోయిన్ గా మారిన ఇనయా.. బుజ్జి ఇలారా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. బిగ్ బాస్ తర్వాత ఇనయాకు సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయినా తగ్గేదేలే అన్నట్టు సోషల్ మీడియాలో తన గ్లామర్ టాలెంట్ తో అందరినీ మెప్పిస్తోంది బ్యూటీ.