Begin typing your search above and press return to search.

ఇనయా సుల్తానా.. గ్లామర్ లో హై వోల్టేజ్ ఫిట్‌నెస్

ఈ ఫొటోలో ఇనయా బలమైన మజిల్స్‌తో స్టైల్‌గా పోజ్ ఇస్తూ, తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని అభిమానులతో పంచుకుంది.

By:  Tupaki Desk   |   11 Sept 2024 2:30 PM
ఇనయా సుల్తానా.. గ్లామర్ లో హై వోల్టేజ్ ఫిట్‌నెస్
X

తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న బిగ్ బాస్ సీజన్ 6 ఫేమ్ ఇనయా సుల్తానా, తాజాగా తన ఫిట్‌నెస్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేస్తూ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో "Green day" అంటూ క్యాప్షన్‌తో ఒక ఫొటో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోలో ఇనయా బలమైన మజిల్స్‌తో స్టైల్‌గా పోజ్ ఇస్తూ, తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని అభిమానులతో పంచుకుంది. ఇనయా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ ఫోటో స్పష్టంగా చూపిస్తోంది. ఆమె తనకు అనువైన గ్రీన్ కలర్ జిమ్ వేర్‌లో, తన స్నేహితుల నడుమా సరదాగా శరీరాన్ని మలచడం, ఫిట్‌నెస్ దిశగా కఠినమైన శిక్షణ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇలాంటి పిక్స్‌తో ఇనయా తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇక ఆమె బిగ్ బాస్ తర్వాత తన సత్తా చాటేందుకు కొత్త సినిమాల్లో అవకాశం దక్కించుకోవడం కోసం ప్రయత్నం అయితే ఆపలేదు. సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా సోషల్ మీడియాలో తన పాపులారిటీ మాత్రం చక్కగా పెరుగుతోంది. ఇలాంటి పిక్స్ షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను అలరిస్తూ వస్తోంది.

ఇక ఇనయా మొదట డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పార్టీల్లో పాల్గొని, డ్యాన్సులతో, ఫోటోలతో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని టాలీవుడ్ చిత్రాల్లో నటించినా, అనుకున్న స్థాయిలో ఆమెకు గుర్తింపు మాత్రం దక్కలేదు. బిగ్ బాస్ లో ఫైర్ బ్రాండ్‌గా కనిపించిన ఇనయా, తన మాట, ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె అందం కుర్రాళ్ల మతులు పోగొట్టింది, కానీ వాస్తవంగా సినిమాల్లో పెద్ద అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

ఇనయా, బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా మారింది. ఆమె తన ఫాలోవర్స్ ను వేరే లెవెల్ లో ఆకర్షిస్తోంది. కొద్దిరోజుల క్రితం జిమ్ ట్రైనర్ గౌతమ్ కొప్పిశెట్టితో తన రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా చెప్పింది. అప్పటినుంచి, ఆమె ప్రేమ జీవితం గురించి పిక్స్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది.