ఆఫ్ స్క్రీన్ ప్రభాస్ తో "ఐ విల్ రేప్ యూ" అంటా!
ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
By: Tupaki Desk | 7 Aug 2023 7:01 AM GMTటాలీవుడ్ స్టార్ హీరో డార్లింగ్ ప్రభాస్ ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో కలిసిపోయి, ఆప్యాయంగా పిలిచే ప్రభాస్ వ్యక్తిత్వానికి చాలా మంది ఫ్యాన్స్ గా మారిపోతారు. అమ్మాయిలు అయితే ప్రభాస్ కటౌట్ చూడగానే ఫ్లాట్ అయిపోతారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ గా ఉన్న కూడా ప్రభాస్ లో డౌన్ టూ ఎర్త్ ఆటిట్యూడ్ ఉంటుంది.
అలాగే సెట్ లో ఇతర యాక్టర్స్ కి ఇంటి భోజనం అందించడం ప్రభాస్ ప్రత్యేకత. ప్రత్యేకంగా వంటకాలు చేయించి తీసుకొచ్చి హీరోయిన్ తో పాటు ఇతర స్టార్స్ కి పెడుతూ ఉంటారు. అతను మంచి భోజన ప్రియుడు అని అందరికి తెలిసిందే.
ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది ఈ జెనరేషన్ అమ్మాయిలకి ప్రభాస్ తో కలిసి నటించాలని కోరిక ఉంటుంది. అలాగే ఫాంటసీలు కూడా ఉంటాయి. ప్రభాస్ లాంటి భర్త కావాలని కోరుకునే వారు ఉంటారు.
అయితే ఓ నటి మాత్రం బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. బుట్టబొమ్మ, కొరమీను, రాజా రాజా చోళ సినిమాలలో నటించిన ఇందు కుసుమ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. గాలివాన వెబ్ సిరీస్ లో ఈమె కీలక పాత్రలో కనిపించింది. తాజాగా ఈ బ్యూటీ ఓ యుట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ప్రభాస్ కి చెల్లిగా నటించే అవకాశం వస్తే ఆన్ స్క్రీన్ మీద చేస్తానని, ఆఫ్ స్క్రీన్ మాత్రం "ఐ విల్ రేప్ యూ" అంటా అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది.ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
గతంలో సల్మాన్ ఖాన్ రెజ్లర్ సినిమా సమయంలో బోల్డ్ కామెంట్స్ చేశారు. నేను రింగ్ నుంచి బయటకి వెళ్ళినపుడు రేప్ చేయబడిన మహిళ వెళ్తున్నట్లు ఫీల్ అవుతానంటూ అన్నాడు. దీనిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. సల్మాన్ ఖాన్ కి మహిళలంటే చులకన అని కామెంట్స్ చేశాయి. ఇప్పుడు అలాంటి కామెంట్స్ యాక్టర్ కుసుమ కూడా చేసింది. మరి దీనిపై మహిళా సంఘాలకి స్పందించే ధైర్యం ఉందా అంటూ పోస్టులు పెడుతున్నారు.