Begin typing your search above and press return to search.

ఇండియా టాప్ 10.. 3వ స్థానం పుష్పదే..

ఇక టాప్ 3 హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 1301 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 1:27 PM GMT
ఇండియా టాప్ 10.. 3వ స్థానం పుష్పదే..
X

ఇండియన్ సినిమాలు అంతర్జాతీయంగా భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. 1000 కోట్ల కలెక్షన్స్ ని చాలా ఈజీగా అందుకుంటూ ఇంటర్నేషనల్ మార్కెట్ లో సత్తా చాటే దిశగా అడుగులు వేస్తున్నాయి. భవిష్యత్తులో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా హాలీవుడ్ లెవెల్ మూవీస్ రావడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంటున్నారు. చైనీస్ సినిమాలు ఇంగ్లీష్ లో రిలీజ్ అవుతూ సత్తా చాటుతున్నాయి. అలాగే ఇండియన్ సినిమాలు కూడా ఇంగ్లీష్ లో రిలీజ్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే అందులో మొదటి స్థానంలో అమీర్ ఖాన్ ‘దంగల్’ ఉంది. ఈ సినిమా ఇండియాలో కంటే చైనాలో ఎక్కువ కలెక్షన్స్ ని సాధించాయి. తద్వారా ఇంటర్నేషనల్ లెవల్ లో సినిమాకి గుర్తింపు లభించింది. ఇక రెండో స్థానంలో ఉన్న ‘బాహుబలి 2’ సినిమా అయితే 1810 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది.

ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలని సమూలంగా మార్చేసిందని చెప్పాలి. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేసిన కంటెంట్ లో దమ్ముంటే భారీ లాభాలు వస్తాయని రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ తో ప్రూవ్ చేశారు. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అన్ని భాషలలో స్టార్ హీరోలు తమ సినిమాలని వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నటీనటులకి కూడా హద్దులు చెరిగిపోయాయి.

బాలీవుడ్ స్టార్స్ సౌత్ సినిమాలలో నటించడానికి ముందుకొస్తున్నారు. అలాగే సౌత్ హీరోలకి బాలీవుడ్ లో అగ్రతాంబూలం లభిస్తోంది. నిర్మాతలు కూడా వందల కోట్ల బడ్జెట్ లు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఇక టాప్ 3 హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నిలిచింది. ఈ సినిమా కేవలం 11 రోజుల్లోనే 1301 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. గట్టిగా ప్రయత్నం చేస్తే 2000 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించొచ్చు అని ‘పుష్ప 2’కి వస్తోన్న కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇక హైయెస్ట్ కలెక్షన్స్ పరంగా నాలుగో స్థానంలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ 1290 కోట్లతో నిలిచింది. ఈ సినిమా ఆస్కార్, గోల్డెల్ గ్లోబ్ అవార్డ్స్ కూడా అందుకొని సరికొత్త శకానికి బాటలు వేసింది. ఐదో స్థానంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీ ఉంది. ఈ సినిమాకి 1233 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. టాప్ 6లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ 1160 కోట్లతో నిలిచింది.

దంగల్ – 1958CR

బాహుబలి 2 – 1810CR

పుష్ప 2 - 1301CR+**(11 Days)

ఆర్ఆర్ఆర్ – 1290.00CR

కేజీఎఫ్ 2 – 1233CR

జవాన్ - 1160Cr

కల్కి 2898ఏడీ – 1061.50CR

పఠాన్ – 1051CR

యానిమల్ - 913Cr

బజరంగీ భాయ్ జాన్ - 870cr