Begin typing your search above and press return to search.

ఆస్కార్ 2024: బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియాకు ఛాన్స్‌?

ఇది భారతీయ మూలాలు ఉన్న‌ చిత్రంగా మొదటి భారతీయ పాటగా గుర్తింపు పొందింది.

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:22 PM GMT
ఆస్కార్ 2024: బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియాకు ఛాన్స్‌?
X

గత సంవత్సరం SS రాజమౌళి RRR వివిధ అంతర్జాతీయ చలనచిత్ర అవార్డులలో వేవ్స్ క్రియేట్ చేసింది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల‌ను గెలుచుకుంది. RRR హిట్ పాట `నాటు నాటు..` చివరికి ఆస్కార్స్ 2023లో చరిత్ర సృష్టించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేట‌గిరీలో ఈ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఇది భారతీయ మూలాలు ఉన్న‌ చిత్రంగా మొదటి భారతీయ పాటగా గుర్తింపు పొందింది.

ఇప్పుడు మ‌రోసారి ఆస్కార్ పోటీలో భార‌తీయ సినిమాలు ఏం చేస్తాయో చూడాల‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

2024 ఆస్కార్ నామినేషన్లు 24 జనవరి 2024న ప్రకటిస్తారు. ఈ సంవత్సరం రెండు భారతీయ చిత్రాలు ఇంకా పోటీలో ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో రెండు భారతీయ చిత్రాలు పోటీలో ఉన్నాయి. ఇటీవల అకాడమీ ఆస్కార్ లకు అర్హత సాధించిన 321 వ‌ర‌ల్డ్ బెస్ట్ సినిమాల‌లో 265 సినిమాలు ఉత్తమ చిత్రం విభాగంలో నామినీలుగా పోటీకి అర్హత పొందాయని ప్రకటించింది.

2023లో విమర్శకుల ప్రశంసలు పొందిన రెండు భారతీయ చిత్రాలు ట్వ‌ల్త్ ఫెయిల్, 2018 రేసులో ఉన్నాయి. విధు వినోద్ చోప్రా హార్ట్‌రెండింగ్ డ్రామా ట్వ‌ల్త్ ఫెయిల్ ... టివినో థామ‌స్ ఇంటెన్స్ సర్వైవల్ డ్రామా 2018 ఆస్కార్స్ 2024కి అర్హత సాధించిన 265 చిత్రాల జాబితాలో ఉన్నాయి.

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ?

ఇటీవల ప్రకటించిన 2024 ఆస్కార్ షార్ట్‌లిస్ట్‌లో ఏ భారతీయ సినిమా పేరు లేకపోవడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కానీ అది `ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్` కేటగిరీ వ‌ర‌కే వ‌ర్తిస్తుంది.. వాస్తవానికి 2018 ఈ విభాగంలో భారతదేశం నుంచి అధికారికంగా ప్ర‌వేశించింది. అయినప్పటికీ 2018 - ట్వ‌ల్త్ ఫెయిల్ ఇప్పటికీ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆస్కార్ కి పోటీ పడేందుకు అర్హతను కలిగి ఉన్నాయి.

బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియాకు అవకాశం ఉందా? అంటే.. నిజానికి రెండు భారతీయ చిత్రాలకు అవకాశం లేదని చెప్పవచ్చు.. కానీ సాంకేతికంగా ఆ రెండు చిత్రాలు రేసులో నిలిచాయి. అయితే గత సంవత్సరంలో ఓపెన్‌హైమర్, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ వంటి చిత్రాలు సృష్టించిన సంచలనం.. ఆ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే అవార్డుల సర్క్యూట్‌లో ట్వ‌ల్త్ ఫెయిల్ , 2018 చిత్రాల‌ ఫైనల్ కట్‌కి రావడానికి ఇంకా చాలా ఎక్కువ అవసరం.

నామినీల తుది జాబితాలో చేరాలంటే సినిమా బాగుండడమే కాకుండా దానికి సరైన ప్రచారం కూడా అవసరం. వాటాదారులు లేదా నిర్మాత‌లు తమ ప్రాజెక్ట్‌ను ఉద్దేశించిన ప్రేక్షకుల (ఆస్కార్ జ్యూరీ) కోసం పూర్తిగా మార్కెట్ చేయాలి. నామినేషన్లు ప్రకటించటానికి నెలల ముందు సంచలనం సృష్టించాలి. అవార్డుల జ్యూరీచే గుర్తింపు లేకముందే RRR ప్రపంచవ్యాప్తంగా నెలల తరబడి వేడి పెంచింది. 2018, ట్వ‌ల్త్ ఫెయిల్ ఈ రెండు చిత్రాల‌ను ఆ కోణంలో చూస్తే అవార్డుల సర్క్యూట్‌లో ఎలాంటి సందడిని సృష్టించలేకపోయాయి. సినిమాలో కంటెంట్ ఉంటే స‌రిపోదు.. చాలా మార్కెటింగ్ స్ట్రాట‌జీ కీల‌కం. దానికోసం భారీగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది.