హైప్ తగ్గట్టుగా ఉంటుందా?
అయితే కిల్ మూవీ జులై 5వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దీంతో ఆ మూవీ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 29 Jun 2024 7:11 AM GMTకిల్.. ఇండియాలోనే అత్యంత హింసాత్మక మూవీ! ఎక్కువగా కమర్షియల్, లవ్ స్టోరీలను రూపొందించే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. గత ఏడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ మూవీ ప్రదర్శించగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇటీవల కిల్ థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
నిఖిల్ నగేష్ భట్.. తెరకెక్కించిన ఈ మూవీ ఇండియాలోనే మోస్ట్ వైలెన్స్ చిత్రంగా మేకర్స్ చెబుతున్నారు. బాలీవుడ్ కు ఈ మూవీతో లక్ష్య హీరోగా పరిచయం అవుతున్నారు. రెమో డిసౌజా మూవీస్ లో డ్యాన్సర్ గా సినీ ప్రియులను మెప్పించిన రాఘవ్.. ఈ చిత్రంతో విలన్ గా మారారు. తాన్యా మాణిక్తలా ఫిమేల్ లీడ్ రోల్ పోషించారు. సినిమా అంతా దాదాపుగా ట్రైన్ లోనే నడుస్తుందని ట్రైలర్ చూస్తుంటేనే ఈజీగా తెలుస్తోంది.
ట్రైలర్ ప్రకారం.. రైలు ఎక్కిన కొందరు దుండగులు.. హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తారు. దీంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు హీరో. అప్పుడు అతడు సైనికుడు అని తెలిసి.. అదే ట్రైన్ లో ఉన్న కొందరు ప్రయాణికులు కూడా హెల్ప్ చేస్తారు. కానీ వారిని క్రిమినల్స్ చంపేస్తారు. అలా మూవీ స్టోరీ అంతా రైలులోనే జరగనున్నట్లు ఈజీగా తెలుస్తుంది. చివరకు ఏమైందనేది మిగతా సినిమా. అయితే ట్రైలర్ లో సీన్స్ చాలా వైలెంట్ గా కనిపిస్తున్నాయి.
కొన్ని సీన్స్ భయంకరంగా కూడా ఉన్నాయి. చాలా సన్నివేశాలు డిస్టర్బింగ్ గా అనిపిస్తున్నాయి. దీంతో వైలెన్స్ ను ఇష్టపడే వారికే ఈ సినిమా అన్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. యష్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహ్తా, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ సంయుక్తంగా కిల్ మూవీ నిర్మించారు. ఎక్కువ వైలెన్స్ ఉందంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీకి మించి కిల్ ట్రైలర్ ఉంది.
అయితే కిల్ మూవీ జులై 5వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దీంతో ఆ మూవీ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. సిల్వర్ స్క్రీన్ పై అంతటి వైలెన్స్ ను సినీ ప్రియులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అంటున్నారు. ఇండియాలోనే మోస్ట్ వైలెన్స్ మూవీగా మేకర్స్ ప్రమోట్ చేస్తున్నారు. మరి ఆ హైప్ తగ్గట్టు సినిమా ఉంటుందా లేక ప్రమోషన్స్ కోసమే అలా చెబుతున్నారా అనేది చూడాలి.