ఆహాలో ఇండియన్ డ్యాన్సింగ్ ఫైట్..!
ఐతే ఇవే కాకుండా ఆహాలో బాలయ్యతో అన్ స్టాపబుల్ షో రికార్డులు సృష్టిస్తుంది.
By: Tupaki Desk | 3 Jan 2025 1:11 PM GMTతెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఇప్పటికే ప్రేక్షకులకు సూపర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. సినిమా లవర్స్ ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేసేలా కొత్త కంటెంట్ ని తీసుకొస్తున్నారు. తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీకి ఆహానే ఫస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. మరోపక్క ఆహా ఒరిజినల్స్ అంటూ కొత్త వెబ్ సీరీస్ లతో అలరిస్తుంది. ఐతే ఇవే కాకుండా ఆహాలో బాలయ్యతో అన్ స్టాపబుల్ షో రికార్డులు సృష్టిస్తుంది. వీటికి తోడుగా ఇండియన్ ఐడల్ తెలుగు ని తీసుకొచ్చారు.
తెలుగు సింగింగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ తెలుగు ఇండియన్ ఐడెల్ తెలుగుని ప్రజెంట్ చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఇండియన్ ఐడల్ తెలుగు అదరగొడుతుంది. ఇక ఇప్పుడు సింగింగ్ తో అదరగొట్టడమే కాదు డ్యాన్స్ తో దుమ్ముదులిపేందుకు సిద్ధమవుతుంది. ఆహా డ్యాన్సింగ్ ఫైట్ కు సిద్ధమవుతుంది. డ్యాన్స్ ఫ్లోర్ తో దమ్ము చూపేందుకు రెడీ అవుతున్నారు. ఆహాలో రాబోతున్న ఈ డ్యాన్స్ షోని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు.
ఆహా డ్యాన్స్ షోని త్వరలో తీసుకొస్తుంది. ఈ షోలో సూపర్ డ్యాన్సర్స్, అదిరిపోయే మూమెంట్స్ తో అదరగొట్టబోతున్నారు. త్వరలోనే ఈ షో ప్రోమోని రిలీజ్ చేయనున్నారు. ఆహా డ్యాన్స్ షో కంటెస్టెంట్స్ ఇంకా సెలబ్రిటీస్ ఎవరన్నది చూడాలి. ఆహా ఇండియన్ ఐడెల్ తెలుగుని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇక ఇప్పుడు డ్యాన్స్ షోలో దిగుతుంది ఆహా. ఆల్రెడీ స్మాల్ స్క్రీన్ పై ఎన్నో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ని ప్రేక్షకులను అలరిస్తుండగా ఇప్పుడు ఆహా ఓటీటీలో కూడా డ్యాన్స్ షోతో తమ సబ్ స్క్రైబర్స్ ని మరిత ఎంటర్టైన్ చేయనున్నారు.
ఆహా ఓటీటీ ఇప్పటికే తెలుగు ఓటీటీగా టాప్ ప్లేస్ లో ఉంది. తెలుగు ఆడియన్స్ కు ఎంటర్టైన్ మెంట్ అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది ఆహా. ముఖ్యంగా ఆహా ఓటీటీ నుంచి ఇండియన్ ఐడెల్ ఇంకా అన్ స్టాపబుల్ షోని గ్రాండ్ సక్సెస్ అందుకుంది. రాబోతున్న ఈ షో మరింత ఆకర్షణ గా మారబోతుందని చెప్పొచ్చు. మిగతా ఓటీటీలకు కంటెంట్ ఇవ్వడంలో ఏమాత్రం వెనక్కి తగ్గని ఆహా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తో పాటు మిగతా ఓటీటీలకు గట్టి పొటీ ఇస్తుంది.