ఇండియన్ సినిమా కేరాఫ్ టాలీవుడ్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమ పాన్ ఇండియాలో సాధించిన విజయాలు....ఇక్కడ బడ్జెట్లు చూస్తే ఆ విషయం అవగతం అవుతుంది.
By: Tupaki Desk | 11 Dec 2024 11:30 PM GMTభారతీయ చిత్ర పరిశ్రమలో అతి పెద్ద పరిశ్రమ బాలీవుడ్. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ ఇతర పరిశ్రమల పేర్లు వినిపించేవి. భారీ బడ్జెట్ చిత్రాలు ఎక్కువగా హిందీలో మాత్రమే తెరకెక్కేవే. హిందీ జాతీయ భాష కూడా కావడంతో? ఆ పరిశ్రమకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. దీంతో ఇండియన్ సినిమాకి కేరాఫ్ అంటే బాలీవుడ్ అనేవారంతా. కానీ ఇప్పుడా సీన్ మారింది. భారతీయ చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమ పాన్ ఇండియాలో సాధించిన విజయాలు....ఇక్కడ బడ్జెట్లు చూస్తే ఆ విషయం అవగతం అవుతుంది. 'బాహుబలి' తర్వాత తెలుగు పరిశ్రమ పాన్ ఇండియాలో ఎంత సంచలనమైందో తెలిసిందే. ఆ విజయం తో ఆస్కార్ కూడా రావడంతో? అంతర్జాతీయ స్థాయిలో తెలుగు పరిశ్రమ ఖ్యాతికెక్కింది. అటుపై 'సాహో,' 'ఆర్ ఆర్ ఆర్', 'కార్తికేయ-2', 'పుష్ప', 'సలార్',' కల్కి 2898', 'దేవర' లాంటి సినిమాలు పాన్ ఇండియాలో ఎలాంటి విజయాలు నమోదు చేసాయో తెలిసిందే.
అన్నింటిని మించి ఇటీవల రిలీజ్ అయిన 'పుష్ప-2' సంచలనం ఓ చరిత్ర అన్నది తెలిసిందే. బాలీవుడ్ లో ఖాన్ లు..కపూర్ రికార్డులనే తిరగరాసి హిందీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు రాసింది. దెబ్బకి బాలీవుడ్ హీరోలు, దర్శక, నిర్మాతలు తమకు సాధ్యం కానిదే బన్నీ ఎలా సాధించాడంటూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. సినిమాలో బన్నీ డైలాగులాగే వైల్డ్ ఫైర్ గానే ఇప్పుడక్కడ చర్చ సాగుతోంది.
ఇక టాలీవుడ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు అలాంటి సంచలనాలే. 'ఎస్ ఎస్ ఎంబీ 29', నాగచైతన్య 'తండేల్ ', సలార్-2',' పౌజీ', 'దేవర-2', 'కల్కి2', ' పుష్ప-3' ఇవన్నీ కూడా పాన్ ఇండియా మార్కెట్ ని పరుగులు పెట్టించే కంటెంట్ ఉన్న చిత్రాలే. కన్నడ నుంచి కేజీఎఫ్, కాంతార లాంటి సినిమాలున్నా? అక్కడ పాన్ ఇండియా వేవ్ అంతగా లేదు. కోలీవుడ్ ప్రయత్నిస్తున్నప్పటికీ వైఫల్యమే ఎదురవుతుంది. బాలీవుడ్ దర్శక, హీరోలు టాలీవుడ్ ని ఎలా బీట్ చేయాలనే ఆలోచనతో ముందు కెళ్తున్నారు.