Begin typing your search above and press return to search.

2024 బాక్సాఫీస్.. సెంచరీ కొట్టిన సినిమాలివే..

ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే సినిమాల స్టాండర్డ్స్ గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగాయి.

By:  Tupaki Desk   |   3 Oct 2024 2:30 PM GMT
2024 బాక్సాఫీస్.. సెంచరీ కొట్టిన సినిమాలివే..
X

ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చే సినిమాల స్టాండర్డ్స్ గత ఐదేళ్లలో గణనీయంగా పెరిగాయి. భారతీయ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణని సొంతం చేసుకుంటున్నాయి. అలాగే సినిమా బడ్జెట్ లు పెరగడంతో యూనివర్సల్ అప్పీల్ ఉండే కథలని మన దర్శకులు చెప్పడానికి ముందుకొస్తున్నారు. యాక్టర్స్ కూడా పంక్తు కమర్షియల్ ఫార్ములా ఛాయల నుంచి బయటకొచ్చి కొత్త కథలతో మూవీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

అందుకే ప్రేక్షకులకి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించే సినిమాలు వివిధ భాషల నుంచి వస్తున్నాయి. మంచి కంటెంట్ ఎక్కడ నుంచి వచ్చిన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దాంతో సౌత్ సినిమాల కథలకి కూడా దేశీయంగా డిమాండ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన సినిమాలలో 100 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాల జాబితా చూసుకుంటే హిందీతో పాటు తెలుగు, తమిళ్, మలయాళీ, పంజాబీ భాషల నుంచి ఉన్నాయి.

బాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ లలో 9 చిత్రాలు ఈ ఏడాది అత్యంత 100 కోట్ల క్లబ్ లో చేరాయి. వాటిలో, శ్రద్ధా కపూర్ ‘స్త్రీ2’ టాప్ లో ఉంది. దీని తర్వాత హృతిక్ రోషన్ ‘ఫైటర్’, షాహిద్ కపూర్, కృతి సనన్ రొమాంటిక్ డ్రామా ‘తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా’, ‘ఆర్టికల్ 370’, అజయ్ దేవగన్ ‘సైతాన్’, ఫీమేల్ సెంట్రిక్ మూవీ ‘క్రూ’, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ‘బడే మియాన్ చోటే మియాన్’, విక్కీ కౌశల్ ‘బ్యాడ్ న్యూస్’, చిన్న సినిమా ‘మంజ్య’ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఏడాది బాలీవుడ్ ని కొంత సేఫ్ పొజిషన్ లో నిలబెట్టాయి.

ఇక టాలీవుడ్ నుంచి వచ్చిన 6 సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. వాటిలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రం ‘కల్కి 2898ఏడీ’ టాప్ లో ఉంది. ఎన్టీఆర్ ‘దేవర’ కలెక్షన్స్ 400 కోట్లకి దగ్గరగా ఉన్నాయి. ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, సిద్దు జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, నాని ‘సరిపోదా శనివారం’ మూవీస్ 100 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకున్న చిత్రాలుగా నిలిచాయి.

ఇక కోలీవుడ్ లో 5 సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి. వాటిలో దళపతి విజయ్ ‘ది గోట్’, విజయ్ సేతుపతి ‘మహారాజ’, ‘అరణ్మణై 4’, ధనుష్ ‘రాయన్’, కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘ఇండియన్ 2’, ‘ది గోట్’ సినిమాలు కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచాయి. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్యలో వచ్చిన ఈ సినిమాలు ప్రేక్షకుల అంచనాలని అందుకోలేకపోయాయి.

నెక్స్ట్ మలయాళీ ఇండస్ట్రీలో ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ప్రేమలు’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ది గోట్ లైఫ్’, ఫాహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమాలు 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి. పంజాబీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ‘జాట్ అండ్ జూలియట్ 3’ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. హాలీవుడ్ సినిమాలైనా ‘డెడ్ పూల్ అండ్ వుల్వరైన్’, ‘గాడ్జిల్లా ఎక్స్ కాంగ్’ సినిమాలు ఇండియాలో 100 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించాయి.