Begin typing your search above and press return to search.

కెనడా మంత్రులుగా ఇద్దరు భారత సంతతి ఎంపీలు!

ఇప్పుడు కెనడాలోనూ ఇద్దరు భారత సంతతి ఎంపీలు గొప్ప ఘనతను సాధించారు.

By:  Tupaki Desk   |   16 March 2025 12:04 PM IST
కెనడా మంత్రులుగా ఇద్దరు భారత సంతతి ఎంపీలు!
X

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా మన భారతీయ మూలాలే కనిపిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలైనా.. బ్రిటన్ ప్రధాని అయినా కూడా మన భారతీయులే గత సారి చేశారు. ఇప్పుడు కెనడాలోనూ ఇద్దరు భారత సంతతి ఎంపీలు గొప్ప ఘనతను సాధించారు. భారతీయతను మరోసారి ఇనుమడింప చేశారు. ఈ ఇద్దరి నియామకం ఇప్పుడు భారతీయులను ఉప్పొంగేలా చేసింది. మన మార్క్ ను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.

కెనడా నూతన ప్రధాని మార్క్‌ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి ఎంపీలకు స్థానం లభించింది. ఇండో-కెనడియన్‌ అనిత ఆనంద్‌, ఢిల్లీలో జన్మించిన కమల్‌ ఖేరాలకు మంత్రి పదవులు లభించాయి. కార్నీ, ఆయన మంత్రివర్గ సభ్యులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

అనితకు ఇన్నోవేషన్‌, సైన్స్‌, పరిశ్రమల శాఖ, కమల్‌ ఖేరాకు ఆరోగ్య శాఖ ఇచ్చారు. మంత్రి పదవులను నిలబెట్టుకున్న కొద్ది మందిలో వీరిద్దరూ ఉన్నారు. కమల్‌ బాల్యంలోనే ఆమె తల్లిదండ్రులు కెనడాకు వలస వెళ్లారు. పార్లమెంటుకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కులైన మహిళలలో ఆమె ఒకరు. లిబరల్‌ పార్టీలో ప్రధాని పదవికి పోటీలో ముందున్న అనిత జనవరిలో తాను పోటీలో లేనని ప్రకటించారు.

* మంత్రివర్గంలో భారత సంతతి మహిళలు

కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి మహిళలకు స్థానం లభించింది. ఈ ఇద్దరు మహిళలు అనితా ఆనంద్ , కమల్ ఖేరా. అనితా ఆనంద్ ఇండో-కెనడియన్ కాగా, కమల్ ఖేరా ఢిల్లీలో జన్మించారు.

అనితా ఆనంద్: ఇన్నోవేషన్, సైన్స్, ఇండస్ట్రీ మంత్రిగా నియమితులయ్యారు.

కమల్ ఖేరా: ఆరోగ్య శాఖ మంత్రిగా నియమితులయ్యారు.

ఈ ఇద్దరు మహిళలు తమ మంత్రి పదవులను నిలబెట్టుకున్నారు. కమల్ ఖేరా చిన్న వయస్సులోనే తన తల్లిదండ్రులతో కలిసి కెనడాకు వలస వెళ్లారు. ఆమె పార్లమెంటుకు ఎన్నికైన అతి పిన్న వయస్కులైన మహిళలలో ఒకరు. లిబరల్ పార్టీలో ప్రధాని పదవికి పోటీదారుగా ఉన్న అనితా ఆనంద్ జనవరిలో తాను పోటీలో లేనని ప్రకటించారు.