Begin typing your search above and press return to search.

పీవీ సింధు పెళ్లికి గ్రౌండ్‌ ఫిక్స్

ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి పీవీ సింధు వార్తల్లోనే ఉంటారు. ఇప్పుడు మరోసారి సింధు వార్తల్లో నిలిచారు.

By:  Tupaki Desk   |   3 Dec 2024 5:15 AM GMT
పీవీ సింధు పెళ్లికి గ్రౌండ్‌ ఫిక్స్
X

రెండు సార్లు ఒలింపిక్ పతకాన్ని ఇండియాకి సాధించి పెట్టిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సినిమా తారల స్థాయిలో సెలబ్రిటీ హోదాను కలిగి ఉంటుంది అనే విషయం తెల్సిందే. ఆమెకు సంబంధించిన ఏ విషయం అయినా జనాల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆటకు గ్లామర్‌ను అద్దడంతో పాటు, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను సైతం అద్దడం ద్వారా పీవీ సింధు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి పీవీ సింధు వార్తల్లోనే ఉంటారు. ఇప్పుడు మరోసారి సింధు వార్తల్లో నిలిచారు.

ఈసారి ఆట, బ్రాండింగ్‌, సినిమాల గురించి కాకుండా పెళ్లి కారణంగా వార్తల్లో నిలిచింది. పీవీ సింధు వివాహం డిసెంబర్‌ 22న ఉదయ్‌పూర్‌లో వైభవంగా జరగబోతుంది. పెళ్లికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందమైన పీవీ సింధు అంటే ఎంతో మందికి క్రష్ ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోయిన్స్ ని మించిన క్రేజ్ ఉన్న పీవీ సింధు పెళ్లి వార్తలు ఒక్కసారిగా వైరల్‌ అయ్యాయి. ఆమె పెళ్లి వార్తలు విని కొందరు గుండెలు పట్టుకున్నారు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ అధినేత వెంకట దత్త సాయితో పీవీ సింధు వివాహం జరగబోతుంది. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే తెలుగు పద్దతిలో మొదలు అయ్యాయి. రెండు కుటుంబాలు కలిసి రెండు నెలల క్రితమే పెళ్లిని ఫిక్స్ చేయడం జరిగిందట. కొన్ని కారణాల వల్ల ఇన్ని రోజులు ఆ విషయం చెప్పకుండా ఉంచారు. ఇప్పుడు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టినట్లుగా సింధు ఫ్యామిలీ నుంచి అధికారికంగా ప్రకటన రావడంతో సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

డిసెంబర్‌ 20 నుంచి ఉదయ్ పూర్‌లో పెళ్లి హంగామా మొదలు కాబోతుంది. డిసెంబర్‌ 22న పెళ్లి వైభవంగా జరగుతుంది. డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలు, మీడియా, రాజకీయ ప్రముఖులకు వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేయడం జరిగుతుందట. మొత్తానికి పీవీ సింధు పెళ్లి కూతురు కాబోతున్న నేపథ్యంలో ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఇప్పటికే పీవీ సింధు గతంలో మోడలింగ్‌లో బాగంగా, బ్రాండింగ్‌లో భాగంగా పెళ్లి కూతురుగా రెడీ అయిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. మరో వైపు సింధును చేసుకోబోతున్న వ్యక్తి దత్త సాయి గురించి గూగుల్‌ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.