Begin typing your search above and press return to search.

ఇండియన్ 2 బుకింగ్స్.. పరిస్థితి ఎలా ఉందంటే..

దీంతో ఇండియన్ 2పై అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది. అయితే ఆరంభంలో బడ్జెట్ కారణాల వలన కొంతకాలం వాయిదా పడింది.

By:  Tupaki Desk   |   10 July 2024 6:50 AM GMT
ఇండియన్ 2 బుకింగ్స్.. పరిస్థితి ఎలా ఉందంటే..
X

ఒక స్టార్ హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే, ఆ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి పబ్లిక్ ఇంటరెస్ట్ ఏ రేంజ్ లో ఉందో అంచనా వేయవచ్చు. సౌత్ లో డార్లింగ్ ప్రభాస్ సినిమాలకి అన్ని భాషలలో సాలిడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయి. కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 100 కోట్లకి పైగా కలెక్షన్స్ వచ్చాయి. దీనిని బట్టి ఈ సినిమా పట్ల ప్రేక్షకుల ఎంత ఆసక్తిగా ఎదురుచూసారో చెప్పొచ్చు.

కల్కి 2898ఏడీ తర్వాత సౌత్ నుంచి రాబోతున్న మరో పెద్ద సినిమా ఇండియన్ 2. యూనివర్శల్ యాక్టర్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కింది. జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 300+ కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడో నాలుగేళ్ల క్రితమే ప్రారంభమైంది. భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ స్టార్ట్ అయ్యింది.

దీంతో ఇండియన్ 2పై అందరిలో ఆసక్తి క్రియేట్ అయ్యింది. అయితే ఆరంభంలో బడ్జెట్ కారణాల వలన కొంతకాలం వాయిదా పడింది. తరువాత వేర్వేరు ఇష్యూలతో వాయిదా పడుతూ వచ్చింది. ఈ కారణంగా సినిమా ప్రేక్షకుల ముందుకి రావడానికి సుదీర్ఘ కాలం పట్టింది. బాగా ఆలస్యం కావడంతో మూవీపైన హైప్ తగ్గిపోయింది. కోలీవుడ్ లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఇండియన్ 2 మూవీ వస్తోంది. కనీసం ఆ రాష్ట్రంలో కూడా పబ్లిక్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదు.

ఇండియన్ 2 నుంచి వచ్చిన సాంగ్, ట్రైలర్ ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేదు. శంకర్ సినిమాలలో కనిపించే ఇంటరెస్ట్ ఈ ట్రైలర్ లో మిస్ అయ్యిందనే అభిప్రాయం ఆడియన్స్ నుంచి వచ్చింది. అయితే కమల్ హాసన్ సేనాపతి క్యారెక్టర్ తో ఏదో ఒక మాయ చేస్తాడని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమిళంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. 1150 థియేటర్స్ లో మూవీ తమిళనాట రిలీజ్ అవుతోంది.

అయితే ఇప్పటి వరకు 24% మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయంట. కమల్ హాసన్, శంకర్ ఇమేజ్ తో బట్టి చూస్తే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా లో ఫేజ్ లో నడుస్తున్నట్లు చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలలో కూడా భారతీయుడు 2 పేరుతో మూవీ రిలీజ్ అవుతోంది. సినిమా ప్రీరిలీజ్ఈవెంట్ నిర్వహించారు. కమల్ హాసన్, సిద్ధార్ధ్, శంకర్ అందరూ ఈవెంట్ లో పాల్గొని మూవీ గురించి చెప్పారు. అయిన కూడా పబ్లిక్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదంట. ఇలాగే ఉంటే చాలా తక్కువ ఓపెనింగ్స్ ని ఇండియన్ 2 మూవీ నమోదు చేసే అవకాశం ఉంది. మౌత్ టాక్ బాగుంటే తరువాత ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.