'ఇండియన్-2' బిహైండ్ ఏం జరుగుతోంది?
ఈ నేపథ్యంలో భారతీయుడు ప్రాంచైజీ నుంచి ఎన్ని భాగాలు రిలీజ్ అవుతున్నాయి? అన్న దానిపై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 16 Nov 2023 7:35 AM GMTభారతీయులు ఇద్దరా? ముగ్గురా? నలుగురా? అన్నది ఇప్పుడు అందరి ముందున్న సందేహం. రెండు దశాబ్ధాల తర్వాత శంకర్ `భారతీయుడు` సీక్వెల్ తెరకెక్కిస్తోన్న నేపథ్యంలో వస్తోన్న సందేహాలివన్ని. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. విజయవాడలో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే నాలుగు గంటల పుటేజ్ వచ్చిందని దాన్ని కత్తిరించే పనిలో శంకర్ అండ్ కో బిజీగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
ఈ నేపథ్యంలో భారతీయుడు ప్రాంచైజీ నుంచి ఎన్ని భాగాలు రిలీజ్ అవుతున్నాయి? అన్న దానిపై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. నాలుగు గంటల పుటేజీని రెండు భాగాలు చేసి `భారతీ యుడు-2`..`భారతీయుడు-3`గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వినిపిస్తుంది. అయితే ఇదంతా మేకర్స్ నుంచి క్లారిటీ లేని అంశం. అవినీతి..లంచంపై పోరాటాన్ని ఎన్ని భాగాలుగా తీయడా నికైనా ఛాన్స్ ఉంది.
ఈ నేపథ్యంలో ఇది నమ్మలేని నిజం అవ్వడానికి అవకాశాలు అంతే బలంగా కనిపిస్తున్నాయి. ఇటీవలే `భారతీయుడు 2` నుంచి ఓ వీడియో రిలీజ్ అయింది. అది టీజరా? ట్రైలరా? అన్నది ఓ కన్ ప్యూజన్. ప్రచార చిత్రాలైతే అంత పేలవంగా ఎలా ఉంటాయని కొంతమంది అంటుంటే? అది కేవలం రఫ్ పుటేజ్ అని మరికొంత మంది అంటున్నారు. సిసలైన ట్రీట్ ముందుంటుంది? అంటూ ఆశావహులు మరికొంత మంది.
అలాగే అనిరుద్ స్కోర్ చేసిన పాట కూడా రిలీజ్ అయింది. దీనికి డివైడ్ టాక్ వచ్చింది. మరోవైపు `గేమ్ ఛేంజర్` ఆన్ సెట్స్ లో ఉంది. ఇండియన్ -2ని రెండు బాగాలు చేస్తే వీటన్నింటిని శంకర్ ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? ఇది సాధ్యమయ్యే పనేనా? అన్నది మరో డౌట్. ఇలా ఇన్నిరకాల కన్ ప్యూజన్లు పంపిణీ వర్గంల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ సందేహాలన్నింటిని నివృత్తి చేయగలిగేది కేవలం శంకర్ మాత్రమే. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు తీసుకుంటారు? అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.