Begin typing your search above and press return to search.

ఇండియన్ 2 బాక్సాఫీస్.. అంత సీన్ ఉందా?

ఇప్పుడు శంకర్ ముందు రెండు పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. 2.0 తో తాను క్రియేట్ చేసిన రికార్డ్ ని ఇండియన్ 2తో బ్రేక్ చేయడం, అలాగే కోలీవుడ్ కి వెయ్యి కోట్ల కలెక్షన్స్ మూవీని ఇవ్వడం.

By:  Tupaki Desk   |   28 Feb 2024 3:48 AM GMT
ఇండియన్ 2 బాక్సాఫీస్.. అంత సీన్ ఉందా?
X

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న మూవీ ఇండియన్ 2. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే నెలలో పాన్ ఇండియా లెవల్ లో ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఇండియన్ కి సీక్వెల్ గా వస్తూ ఉండటంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి.

ఇండియన్ 2 మూవీతో కోలీవుడ్ లో వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని అందుకోవాలని అక్కడి ప్రేక్షకులు కోరుకుంటున్నారు. టాలీవుడ్ కంటే కోలీవుడ్ మార్కెట్ పెద్దది. టాలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని అందుకున్నాయి. కోలీవుడ్ లో ఏ సినిమా కూడా ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ఆ ఇండస్ట్రీలో రోబో 2.0 పేరు మీదనే ఇంకా హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఉంది.

ఇప్పుడు శంకర్ ముందు రెండు పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. 2.0 తో తాను క్రియేట్ చేసిన రికార్డ్ ని ఇండియన్ 2తో బ్రేక్ చేయడం, అలాగే కోలీవుడ్ కి వెయ్యి కోట్ల కలెక్షన్స్ మూవీని ఇవ్వడం. ఇండియన్ 2 మీద ఉన్న హైప్, ఎక్స్ పెక్టేషన్స్ కారణంగా కచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ కలెక్షన్స్ ఈ ఏడాదిలో కోలీవుడ్ కి వస్తుందని అక్కడి సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

శంకర్ 2018లో చివరిగా సినిమా చేశారు. ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఇండియన్ 2తో వస్తున్నారు. ఈ మూవీ దేశ వ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయాలంటే కథని ఎలివేట్ చేసే మంచి ట్రైలర్ పడాలి. సాంగ్స్ కూడా రావాలి. అనిరుద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. జైలర్ తోనే గత ఏడాది అనిరుద్ వండర్ క్రియేట్ చేశాడు. ఇండియన్ 2కి కూడా ఏదో మ్యాజిక్ చేస్తాడని భావిస్తున్నారు.

అన్ని భాషలలో ఇండియన్ 2 హిట్ అయితేనే వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాదిలో కోలీవుడ్ నుంచి ఎనిమిది పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. వాటిలో ఒకటైనా రోబో 2.0 రికార్డ్ ని, వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందేమో అనేది చూడాలి. అయితే బజ్ పరంగా మాత్రం సినిమాకు అంత సీన్ లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. తెలుగులో కూడా సినిమా థియేట్రికల్ బిజినెస్ ఈసారి తక్కువగానే జరిగిందని టాక్.