Begin typing your search above and press return to search.

భారతీయుడు 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

సమాజంలో జరిగే తప్పులని శంకర్ తనదైన కోణంలో సినిమాల ద్వారా ఎత్తి చూపిస్తాడు. ఆ కథలకి కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకులకి రీచ్ చేస్తాడు

By:  Tupaki Desk   |   8 July 2024 4:24 AM GMT
భారతీయుడు 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
X

లంచం తీసుకున్న అవినీతిపరులకి మరణదండన శిక్ష విధించే సేనాపతిగా కమల్ హాసన్ 28 ఏళ్ళ క్రితం భారతీయుడు చిత్రంలో తన విశ్వరూపం చూపించాడు. అప్పటి వరకు లంచం గురించి సమాజంలో చర్చించుకోవడం తప్ప ఎదిరించాలనే ధైర్యం ఎవరిలో ఉండేది కాదు. అయితే భారతీయుడు సినిమా ప్రజలకి లంచం అంటే అవినీతి అని, దానిని ఎదిరించాలనే ధైర్యం ఇచ్చింది. తరువాత అలాంటి కథాంశాలతో చాలా సినిమాలు వచ్చాయి.

సమాజంలో జరిగే తప్పులని శంకర్ తనదైన కోణంలో సినిమాల ద్వారా ఎత్తి చూపిస్తాడు. ఆ కథలకి కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకులకి రీచ్ చేస్తాడు. పబ్లిక్ లో ఉండే ఎమోషన్స్ ని తెరపై ఆవిష్కరించడం వలన ఆయన కథలకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు భారతీయుడు మూవీకి సీక్వెల్ గా భారతీయుడు 2 వస్తోంది. ఈ కంటెంట్ కూడా సొసైటీలో పెరిగిపోయిన కరప్షన్ గురించే ఉండబోతోంది. ఈ సారి కరప్షన్ ఏ స్థాయిలో జరుగుతుంది.

దానికి సేనాపతి ఎలాంటి శిక్ష వేసాడు అనేది భారతీయుడు 2లో శంకర్ చూపించబోతున్నాడు. జులై 12న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. నిజానికి శంకర్ సినిమాలకి తెలుగులో మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆయన సినిమాలకి పబ్లిక్ నుంచి అద్భుత ఆదరణ లభిస్తుంది. అయితే శంకర్ నుంచి చివరిగా వచ్చిన ఐ, 2.ఓ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ సినిమాలు డిస్టిబ్యూటర్స్ కి భారీ నష్టాలు తీసుకొచ్చాయి.

అందుకే భారతీయుడు 2 సినిమాకి బిజినెస్ తగ్గిపోయింది. ఈ మూవీపై ఆంధ్రాలో 12 కోట్లు. సీడెడ్ లో 4 కోట్లు, నైజాంలో 9 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే 25 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ భారతీయుడు 2 మూవీపైన అయ్యిందని తెలుస్తోంది. శంకర్ ఇమేజ్, కమల్ హాసన్ స్టార్ స్టేటస్ పరంగా చూసుకుంటే ఈ బిజినెస్ చాలా తక్కువ అని చెప్పాలి.

మూవీపైన కూడా తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ బజ్ లేదు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్ అనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. అంతకుమించి సినిమాపై పబ్లిక్ లో పెద్దగా చర్చ జరగలేదు. మూవీ నుంచి వచ్చిన సాంగ్స్, ట్రైలర్ కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అయితే శంకర్ సినిమా కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే ఏదో అద్భుతం మూవీలో ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. మొత్తంగా సినిమా బాక్సాఫీస్ వద్ద 26 కోట్ల షేర్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క.