Begin typing your search above and press return to search.

ఇండియన్ 2.. ఇక ఇదే చివరి ఛాన్స్

ఈ నేపథ్యంలో ఇండియన్ 2 జనాల్లోకి బలంగా వెళ్లాలంటే ఒక్క ట్రైలర్ తోనే సాధ్యం అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 4:33 AM GMT
ఇండియన్ 2.. ఇక ఇదే చివరి ఛాన్స్
X

ఒక సినిమాకి కొద్దొగొప్పో హైప్ తీసుకురావడంలో కచ్చితంగా ట్రైలర్ కీలక భూమిక పోషిస్తుంది. ట్రైలర్ ప్రేక్షకులకి కనెక్ట్ అయితే కచ్చితంగా మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఎలాంటి బజ్ లేకుండా వచ్చి ట్రైలర్ తోనే ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోయే కల్కి 2898ఏడీ మూవీ కూడా ట్రైలర్ తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది.

సినిమా ట్రైలర్ 2-3 నిమిషాలే ఉన్న అది ఆడియన్స్ ని థియేటర్స్ వరకు రప్పించడంలో చాలా పవర్ ఫుల్ ప్రమోషనల్ వెపన్ లా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ ట్రైలర్ కట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. కంటెంట్ ని ఎలా చెబితే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారనేది అంచనా వేసి ట్రైలర్ రెడీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇండియన్ 2 మూవీ జులై 12న రిలీజ్ కాబోతోంది.

ఇండియన్ కి సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాపై పబ్లిక్ లో పెద్దగా చర్చ జరగడం లేదు. అనిరుద్ కంపోజ్ చేసిన ఒక సాంగ్ ని రిలీజ్ చేసిన అది పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఈ నెల 25న ఇండియన్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకైతే మూవీపైన ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 జనాల్లోకి బలంగా వెళ్లాలంటే ఒక్క ట్రైలర్ తోనే సాధ్యం అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. శంకర్ తన సినిమాల ట్రైలర్ కట్ విషయంలో చాలా షార్ప్ గా ఉంటారు. ట్రైలర్ తోనే అంచనాలు క్రియేట్ చేసి మూవీ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తారు.

ఇండియన్ 2 ట్రైలర్ కూడా అలాగే ఉంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుందా అనేది చూడాలి. ఇండియన్ మూవీ వచ్చి 28 ఏళ్ళ తర్వాత వస్తోన్న సీక్వెల్ కావడంతో పబ్లిక్ లో క్యూరియాసిటీ ఉంది. అయితే అది కోలీవుడ్ వరకే పరిమితం అయిపొయింది. మిగతా భాషల్లో మినిమమ్ బజ్ కూడా లేదు. వరల్డ్ వైడ్ గా బజ్ క్రియేట్ చేయాలంటే మాత్రం ట్రైలర్ కి మంచి స్పందన రావాల్సి ఉంటుంది.