సైలెంట్‌గా బాంబ్ పేల్చిన సేనాపతి
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ భారతీయుడు 2కి సంబంధించిన అప్‌డేట్ రేపు అనగా, అక్టోబర్ 29 ఉదయం 11 గంటలకు బయటకు వస్తుందని లైకా సంస్థ పేర్కొంది.
By: Tupaki Desk | 28 Oct 2023 3:32 PM GMTశంకర్ 'భారతీయుడు 2' చిత్రం 2023-24 సీజన్ మోస్ట్ అవైటెడ్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా బ్రేక్ జర్నీ తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా పూర్తయింది. తొలి కాపీ రెడీ అంటూ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తాజాగా ప్రకటించడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైటెడ్ భారతీయుడు 2కి సంబంధించిన అప్‌డేట్ రేపు అనగా, అక్టోబర్ 29 ఉదయం 11 గంటలకు బయటకు వస్తుందని లైకా సంస్థ పేర్కొంది. కాగితాల దొంతరతో ఉన్న ఫోటోని షేర్ చేసింది. 'కాపీ అందుకున్నాం' అని దానిపై రాసి ఉంది. సేనాపతి సంతకం చేశారు. సీక్వెల్‌లో విశ్వనటుడు కమల్ హాసన్ సేనాపతిగా తన పాత్రను తిరిగి పోషించారని ఇది ధృవీకరించింది. భారతీయుడు 2 చిత్రం మొదటి భాగం కథతో కనెక్టివిటీ ఉన్నది. 1996 బ్లాక్ బస్టర్ కి ఫక్తు సీక్వెల్ కథతో కాకున్నా, ఇది యూనిక్ టచ్ తో అలరిస్తుందని ఇంతకుముందే శంకర్ వెల్లడించారు. చాలా సంవత్సరాల తర్వాత శంకర్ -కమల్ హాసన్ తిరిగి కలిసి పని చేస్తుండడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. కాపీ అందుకున్నాం! అంటూ సడెన్ గా లైకా బాంబ్ పేల్చింది. సేనాపతితో దీనిని ధృవీకరించడం ఉత్కంఠను కలిగించింది.
రెడ్ జెయింట్ మూవీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్, గురు సోమసుందరం, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, రవి వర్మన్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ విక్రమ్ (2022)లో చివరిసారిగా కనిపించిన కమల్ హాసన్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. అతడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898 AD, హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న KH 233 .. మణిరత్నం దర్శకత్వంలో KH 234 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. KH 234 చిత్నం 1987 క్లాసిక్ ఫిల్మ్ నాయకన్ తర్వాత లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ .. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నమ్ ల రెండవ చిత్రం కానుంది. ఇటీవలే సినిమా ప్రారంభమైంది. కమల్ 69వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు శంకర్ కూడా చరణ్ కథానాయకుడిగా 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ కథను కార్తీక్ సుబ్బరాజ్ రాశారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ, ఎస్‌జె సూర్య, అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నాజర్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.