Begin typing your search above and press return to search.

భారతీయుడు 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

అందుకు తగ్గట్లుగానే భారతీయుడు 2లో మరోసారి కమల్ హాసన్ సేనాపతి పాత్రలో 100 ఏళ్ళు పైబడిన వృద్ధుడిగా కనిపించబోతున్నాడు.

By:  Tupaki Desk   |   9 July 2024 6:45 PM GMT
భారతీయుడు 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
X

కమల్ హాసన్, శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. భారతీయుడు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ నుంచి ప్రేక్షకులు చాలా విలక్షణమైన పెర్ఫార్మెన్స్ కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగానే భారతీయుడు 2లో మరోసారి కమల్ హాసన్ సేనాపతి పాత్రలో 100 ఏళ్ళు పైబడిన వృద్ధుడిగా కనిపించబోతున్నాడు.

ఆ వయస్సులో కూడా విలన్స్ తో భారీ ఫైట్స్ చేయబోతున్నట్లు చూపించారు. కమల్ హాసన్ తాజాగా రిలీజ్ అయిన డార్లింగ్ ప్రభాస్ కల్కి 2898ఏడీలో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో కనిపించింది రెండు సీన్స్ లలోనే అయిన ఆయన ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉందని చెప్పొచ్చు. కల్కీ వైబ్ భారతీయుడు 2 మూవీకి కూడా కొంత కలిసొచ్చేలా కనిపిస్తోంది.

శంకర్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. కొన్ని సినిమాలు తమిళంలో కంటే తెలుగులో పెద్ద హిట్స్ అయ్యాయి. శంకర్ అపరిచితుడు మూవీ తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించాయి. రోబో మూవీ కూడా తెలుగునాట భారీ వసూళ్లని సొంతం చేసుకుంది. అయితే తరువాత వచ్చిన స్నేహితుడా, ఐ, 2.ఓ సినిమాలు తెలుగులో సక్సెస్ కాలేదు.

దీంతో ఆయన ఇమేజ్ టాలీవుడ్ లో కొంత తగ్గింది. 2.ఓ, ఐ సినిమాలకి తెలుగు రాష్ట్రాల డిస్టిబ్యూటర్స్ భారీ నష్టాలు ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని భారతీయుడు 2 మూవీని తక్కువ ధరలకి తెలుగు రాష్ట్రాల రైట్స్ ని డిస్టిబ్యూటర్స్ కొనుగోలు చేశారు. లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన లాల్ సలామ్ కూడా తెలుగు డిస్టిబ్యూటర్స్ ని ముంచింది. దీనిని దృష్టిలో ఉంచుకొని భారతీయుడు 2పై పెద్దగా రిస్క్ చేయలేదు.

ఈ కారణంగా మూవీ తెలుగు రాష్ట్రాలలో 25 కోట్ల బిజినెస్ మాత్రమే చేసింది. భారతీయుడు2 లాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీపైన 25 కోట్ల బిజినెస్ అంటే తక్కువని చెప్పొచ్చు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈజీగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ని ఈ చిత్రం అందుకుంటుంది. కమల్ హాసన్ ఇమేజ్, శంకర్ డైరెక్షన్ సినిమాకి ప్రేక్షకులని రప్పిస్తుందని భావిస్తున్నారు. సిద్ధార్ధ్ కూడా ఒకప్పుడు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న స్టార్.

రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా లాంటి యాక్టర్స్ కూడా తెలుగునాట మంచి పాపులారిటీ ఉన్న యాక్టర్స్ గా ఉన్నారు. భారతీయుడుకి సీక్వెల్ గా వస్తోన్న మూవీ కావడంతో ఆ సినిమా పాజిటివ్ ఇమేజ్ భారతీయుడు 2కి పని చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జులై 12న రిలీజ్ కాబోయే ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందనేది చూడాలి.