Begin typing your search above and press return to search.

ఇండియన్ 2: రెహమాన్ కాకుండా అనిరుధ్.. ఎందుకంటే?

తాజాగా డైరెక్టర్ శంకర్ ఈ ప్రశ్నకి క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో జరిగిన మీడియా మీట్ లో ఎందుకు అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నానో తెలిపారు.

By:  Tupaki Desk   |   7 July 2024 4:46 AM GMT
ఇండియన్ 2: రెహమాన్ కాకుండా అనిరుధ్.. ఎందుకంటే?
X

శంకర్ సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ పేరు వినిపిస్తుంది. శంకర్ మొదటి సినిమా జెంటిల్మన్ నుంచి 2.ఓ వరకు మేగ్జిమమ్ సినిమాలకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మధ్యలో హరీస్ జై రాజ్ తో వర్క్ చేశాడు. ఫస్ట్ ఛాయస్ అయితే రెహమాన్ మాత్రమే. అలాంటిది ఇండియన్ 2 మూవీకి మాత్రం శంకర్ కోలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ని ఎంపిక చేశాడు. ఇది ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఇండియన్ మూవీకి రెహమాన్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.

అలాంటిది ఇండియన్ 2కి రెహమాన్ ని కాకుండా అనిరుద్ ని తీసుకోవడం ఏంటనే ప్రశ్న వినిపించింది. తాజాగా డైరెక్టర్ శంకర్ ఈ ప్రశ్నకి క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో జరిగిన మీడియా మీట్ లో ఎందుకు అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నానో తెలిపారు. ఇండియన్ 2 మూవీ స్టార్ట్ చేసే సమయానికి రెహమాన్ 2.ఓకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద వర్క్ చేస్తున్నారు. 2.ఓ చాలా పెద్ద ప్రాజెక్ట్. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా చాలా కీలకం.

అదే సమయంలో ఇండియన్ 2 మూవీకి కమల్ హాసన్ డేట్స్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. 2.ఓ చేస్తూ ఇండియన్ 2కి వర్క్ చేయడం కష్టం అవుతుందనిపించింది. నాకు వ్యక్తిగతంగా అనిరుద్ మ్యూజిక్ బాగా నచ్చుతుంది. అందుకే సెకండ్ ఛాయస్ గా అనిరుద్ ని ఇండియన్ 2 కోసం ఎంపిక చేయడం జరిగిందని శంకర్ క్లారిటీ ఇచ్చారు. నా అంచనాలని నిజం చేస్తూ అనిరుద్ కూడా ఈ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ అందించాడని శంకర్ తెలిపారు.

అలాగే యువన్ శంకర్ రాజా, హరీస్ జయరాజ్, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ కూడా తనకి ఇష్టమేనని, భవిష్యత్తులో వారితో కూడా వర్క్ చేస్తానని శంకర్ పేర్కొన్నారు. తెలుగులో చేస్తోన్న గేమ్ చేంజర్ కి కూడా శంకర్ రెహమాన్ ని కాకుండా తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. అయితే గేమ్ చేంజర్ తెలుగు నేటివిటీ మిక్స్ అయిన పాన్ ఇండియా మూవీ కావడంతో తమన్ ని ఎంపిక చేసుకొని ఉంటారని భావిస్తున్నారు.

ఇండియన్ 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. కమల్ హాసన్ మరోసారి సేనాపతి పాత్రలో ఈ సినిమాలో అలరించబోతున్నారు. సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్ జోడీగా నటించారు. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇండియన్ 2 రిలీజ్ తర్వాత ఇండియన్ 3 మూవీ విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.