Begin typing your search above and press return to search.

శంకర్ సార్.. ఏంటి ఈ రిలీజ్ ట్విస్టులు?

అయితే ఇండియన్-2 రిలీజ్ డేట్ ను రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు.

By:  Tupaki Desk   |   20 May 2024 1:38 PM GMT
శంకర్ సార్.. ఏంటి ఈ రిలీజ్ ట్విస్టులు?
X

విలక్షణ నటుడు కమల్ హాసన్.. 2024లో రెండు భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆ రెండు సినిమాలు దాదాపు రెండు వారాల గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. జూన్ 27వ తేదీన రానున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు కమల్ హాసన్. దీంతోపాటు ఇండియన్-2 చిత్రంలో లీడ్ రోల్ పోషించారు.

అయితే ఇండియన్-2 రిలీజ్ డేట్ ను రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. జులై 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే 22వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దాంతోపాటు స్పెషల్ పోస్టర్ కూడా షేర్ చేశారు మేకర్స్. ఆ పోస్టర్ లో చేతిలో గొడ్డలి పట్టుకుని గుర్రపు స్వారీ చేస్తూ కనిపించిన కమల్.. త్వరలోనే మంచి బజ్ క్రియేట్ చేసేందుకు రంగంలో దిగనున్నారు.

ఇక ఇండియన్-2 మూవీ.. 28 ఏళ్ల క్రితం విడుదలైన భారతీయుడు మూవీకి సీక్వెల్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ఎలా ఉంటుందోనని అంతా చర్చించుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్.. ఇండియన్-3 షూటింగ్ కూడా పూరైనట్లు చెప్పి అందరికీ బిగ్ షాకిచ్చారు. ఇండియన్-2 రిలీజ్ అయ్యాక మూడో పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తామని కూడా తెలిపారు.

అంతే కాకుండా రీసెంట్ గా ఐపీఎల్ కు వచ్చిన కమల్.. ఇండియన్-3 రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇండియన్-2 విడుదలైన ఆరు నెలలకు మూడో పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. కథ పెద్దగా ఉండడంతో ఇండియన్-3 చేయాల్సి వచ్చిందని తెలిపారు. అంటే ఇండియన్-2, ఇండియన్-3, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్

.. ఈ మూడు సినిమాల షూటింగ్స్ ఒకేసారి డైరెక్టర్ శంకర్ జరిపారన్నమాట. అందుకే రిలీజులు వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి.

ఇప్పుడు కమల్ ఇండియన్-2 రిలీజ్ ఓకే గానీ.. గేమ్ ఛేంజర్ పరిస్థితేంటని ఫ్యాన్స్ నెట్టింట గోలగోల చేస్తున్నారు. అయితే గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఇంకా 50 రోజుల షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉందని తెలుస్తోంది. మరో 20 రోజుల్లో చరణ్ తన పార్ట్ ను పూర్తి చేయనున్నారట. దీంతో గేమ్ ఛేంజర్ మూవీని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే దసరాకు తారక్ దేవర కన్ఫమ్ అయింది.

బాలకృష్ణ NBK 109 మూవీ కూడా అప్పుడే రిలీజ్ అవుతుందని అంతా అంటున్నారు. దేవర, బాలయ్య చిత్రాలు పక్కపక్క తేదీల్లో రానున్నాయని కూడా చెబుతున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ దసరాకే రిలీజ్ అంటే.. బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ పక్కా అని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే ఆ సినిమా మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. మరి చరణ్ మూవీ రిలీజ్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో వేచి చూడాలి.

గేమ్ ఛేంజరే కాదు.. ఇండియన్-3 రిలీజ్ విషయంలో కూడా పెద్ద ట్విస్టే ఉంది. ఎందుకంటే ఇండియన్-2 రిలీజ్ డేట్ జులై 12కు ఆరు నెలల తర్వాత అంటే వచ్చే ఏడాది సంక్రాంతి అవుతుంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు పెద్ద పండుగకు కర్చీఫులు వేసేశారు. చిరంజీవి విశ్వంభర.. రిలీజ్ డేట్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. వెంకటేష్, రవితేజ సినిమాలు కూడా అప్పుడే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇండియన్-3 అప్పుడు వస్తే కష్టమే! మరి డైరెక్టర్ శంకర్.. రిలీజ్ డేట్ లపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారో ఏంటో.