Begin typing your search above and press return to search.

'ఇండియన్ 3' భారమంతా 'గేమ్ ఛేంజర్' పైనే!

అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో కాకుండా, థియేటర్లలోనే విడుదల చెయ్యాలని భావిస్తున్నారట.

By:  Tupaki Desk   |   13 Nov 2024 3:30 PM GMT
ఇండియన్ 3 భారమంతా గేమ్ ఛేంజర్ పైనే!
X

సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం 'గేమ్ చేంజర్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన గత చిత్రం 'భారతీయుడు 2' బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అంతకుమించి దర్శకుడిపై బోలెడంత నెగెటివిటీని తెచ్చిపెట్టింది. రొటీన్ స్టోరీతో, ఔట్ డేటెడ్ మేకింగ్ తో విసుగు తెప్పించాడంటూ ఆయన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో 'ఇండియన్ 3' ఎలా ఉంటుందో అనే చర్చలు మొదలయ్యాయి.

'భారతీయుడు' వంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా 'భారతీయుడు 2' తెరకెక్కింది. ఒకే సినిమాగా తీయాలని అనుకునే మొదలుపెట్టారు. కానీ ప్రాజెక్ట్ లేట్ అవ్వడం, బడ్జెట్ లెక్కలు పెరిగిపోవడం, ఫుటేజ్ ఎక్కువ నిడివితో ఉండటం వంటి వివిధ కారణాలతో రెండు భాగాలుగా చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. 'ఇండియన్ 2' క్లైమాక్స్‌లో 'ఇండియన్ 3' ట్రైలర్ ను జత చేసి, థర్డ్ పార్ట్ పై క్లారిటీ ఇచ్చారు. అయితే సెకండ్ పార్ట్ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ మూవీపై జనాల్లో ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయింది.

'ఇండియన్ 2' రిజల్ట్ ను దృష్టిలో పెట్టుకొని, 'ఇండియన్ 3' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించుకున్నారని ఇటీవల రూమర్లు చక్కర్లు కొట్టాయి. నెక్ట్ ఫిక్స్ ఓటీటీ వేదికగా జనవరి నెలలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో కాకుండా, థియేటర్లలోనే విడుదల చెయ్యాలని భావిస్తున్నారట.

ఇప్పటికే 'ఇండియన్ 3' సినిమాకి సంబంధించి దాదాపు 80 శాతానికి పైగానే చిత్రీకరణ పూర్తయింది. మరో 25 రోజుల షూటింగ్ తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుందని టాక్. అయితే 'ఇండియన్ 2' కు వచ్చిన నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తో, శంకర్ తన మిస్టేక్స్ ను గ్రహించి కొన్ని సీన్స్ ను రీషూట్ చెయ్యాలని అనుకుంటున్నారట. హీరో కమల్ హాసన్ సైతం కొన్ని మార్పులు సూచించడంతో, అదనపు సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తమిళ వర్గాలు చెబుతున్నాయి.

'ఇండియన్ 3' రీషూట్‌లు నిజమైతే మాత్రం, అదనంగా మరో 100 కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 'ఇండియన్ 2' తో నష్టాలు ఎదుర్కొన్న లైకా ప్రొడక్షన్స్ కు ఇది అదనపు భారం అనే చెప్పాలి. రెడ్ జెయింట్ మూవీస్ అధినేత ఉదయనిధి స్టాలిన్ సహనిర్మాతగా ఉన్నారు కాబట్టి, సంయుక్తంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావొచ్చు. ఎందుకంటే 'భారతీయుడు 3' కథ మీద కమల్ హాసన్ చాలా నమ్మకంగా ఉన్నారు. సెకండ్ పార్ట్ రిలీజ్ అప్పుడే, తనకు థర్డ్ పార్ట్ నచ్చిందని చెప్పేశారు.

'భారతీయుడు 2'లో జరిగిన తప్పులను సరిద్దుకొని, మార్పులు చేర్పులు చేస్తే పార్ట్-3 ఆడియన్స్ ను ఆకర్షించే అవకాశం వుంది. కాకపోతే ఇప్పుడు శంకర్ ఫోకస్ అంతా రామ్ చరణ్ తో చేస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాపైనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయితే, అది 'ఇండియన్ 3' చిత్రానికి బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ముందుగా చరణ్ సినిమాతో హిట్టు కొట్టడానికి కృషి చేస్తున్నారు. దర్శకుడు దీని తర్వాతే కమల్ హాసన్ మూవీ గురించి ఆలోచించనున్నారు.