Begin typing your search above and press return to search.

ఇండియన్ 3కి ఆ ప్రాబ్లెం ఉండకపోవచ్చు..!

అంతేకాదు ఇండియన్ 2 ఎండ్ లో ఇండియన్ 3 ట్రైలర్ కూడా వదిలారు.

By:  Tupaki Desk   |   20 July 2024 5:15 PM GMT
ఇండియన్ 3కి ఆ ప్రాబ్లెం ఉండకపోవచ్చు..!
X

కమల్ హాసన్ శంకర్ కాంబోలో పాతికేళ్ల క్రితం చేసిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 వచ్చింది. సినిమా ఎక్కువ రోజులు సెట్స్ మీద ఉండటం వల్ల ముందు నుంచి ఒక రకమైన నెగిటివిటీ ఏర్పడింది. దానికి తగినట్టుగానే సినిమా ఉండటంతో డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. కమల్ హాసన్ ఇండియన్ 2 అసలు శంకర్ అనుకున్నది వేరు ఫలితం వచ్చింది వేరు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఇండియన్ 2 కి కొనసాగింపుగా ఇండియన్ 3 ని కూడా పూర్తి చేశాడు శంకర్. అంతేకాదు ఇండియన్ 2 ఎండ్ లో ఇండియన్ 3 ట్రైలర్ కూడా వదిలారు.

ఇండియన్ 2 సినిమా చూసినా రాని కిక్ ఆ ట్రైలర్ చూస్తే వచ్చింది. ఇండియన్ 3 సినిమాలోనే కొత్త కథ.. అదిరిపోయే విజువల్స్ ఉన్నాయని అర్థమవుతుంది. అయితే ఇండియన్ 2 రిజల్ట్ వల్ల ఇండియన్ 3 మీద కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది. ఇండియన్ 3 సినిమా ఆల్రెడీ పూర్తి చేశారు. ఎడిటింగ్ ఒక్కటే ఉన్నట్టు తెలుస్తుంది. 2025 సమ్మర్ లో ఇండియన్ 3 రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.

ఇండియన్ 2 అట్టర్లీ పోవడం వల్ల పార్ట్ 3 ని చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తారా అన్న డౌట్ ఉంది. అంతేకాదు ఇండియన్ 2 ఫలితం చూశాక మేకర్స్ ఇండియన్ 3 ని అసలు రిలీజ్ చేస్తారా అని కూడా డౌట్ పడుతున్నారు. ఐతే సినిమాకు పెట్టిన బడ్జెట్ అంతా మూడో భాగానికి కూడా కేటాయించారు. ఎలాగు ట్రైలర్ ఇంప్రెస్ చేసింది కాబట్టి సినిమా తప్పకుండా ప్రేక్షకుల్లోకి వెళ్తుంది. కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 రిజల్ట్ పై సమీక్ష చేసుకుని పార్ట్ 3ని తప్పకుండా ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యేలా చేయాలని శంకర్ కు సూచించాడట.

ఇండియన్ 3 రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని సినిమా తప్పకుండా నెక్స్ట్ సమ్మర్ కి వస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. మరి ఇండియన్ 2 తో టార్గెట్ రీచ్ కాలేని శంకర్ అండ్ కమల్ హాసన్ భారతీయుడు 3 తో అయినా ఆ సక్సెస్ అందుకుంటారా అన్నది చూడాలి. ఈలోగా చరణ్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు శంకర్. కాబట్టి చరణ్ సినిమా హిట్ అయితే ఆ సక్సెస్ జోష్ ఇండియన్ 3 కి కొనసాగించే ఛాన్స్ ఉంటుంది.