Begin typing your search above and press return to search.

కేన్స్ 2024 ఉత్స‌వంలో ఇండియా బెస్ట్ వీళ్లే

గత రెండు దశాబ్దాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెగ్యులర్ గా మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ పాల్గొంటున్నారు.

By:  Tupaki Desk   |   25 May 2024 2:30 AM GMT
కేన్స్ 2024 ఉత్స‌వంలో ఇండియా బెస్ట్ వీళ్లే
X

'కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్` ప్ర‌త్యేక‌త గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. స్టార్లు - దిగ్గజాలకు త‌మ ఫ్యాష‌న్ శైలి సెన్సిబిలిటీలను ప్రదర్శించడానికి రన్‌వేగా పనిచేస్తుంది. భారతీయ తారలు, దేశంలోని ప్రభావశీలురు తమ స్టైల్, ఫ్యాష‌న్ సెన్స్.. సంస్కృతి తాలూకా తేజస్సును వారి వార‌స‌త్వాన్ని ప్ర‌పంచం గుర్తించడానికి ఈ అవకాశాన్ని స్థిరంగా ఉపయోగించుకున్నారు. ప్రపంచ వేదికపై తమ దేశం నుంచి ప్రత్యేకమైన శైలిని ప్రదర్శిస్తున్నారు.


గత రెండు దశాబ్దాలుగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెగ్యులర్ గా మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ పాల్గొంటున్నారు. 2024 ఎడిషన్‌లో మోనోక్రోమ్ గౌనులో ఫల్గుణి షేన్ పీకాక్ డిజైన్ చేసిన‌ 3D మెటాలిక్ డ్రెస్ లో క‌నిపించారు. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐష్‌ రెండవ ప్రదర్శనలో డిజైనర్ ద్వయం ఫల్గుణి షేన్ పీకాక్ రూపొందించిన మెరిసే నీలం, వెండి గౌనును ధరించారు.


ఎనిమిది సంవత్సరాల తర్వాత కేన్స్ రెడ్ కార్పెట్‌పై అబ్బురపరిచేలా తిరిగి రీఎంట్రీ ఇచ్చిన‌ శోభితా ధూళిపాళ తన స్టైలిష్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. నమ్రతా జోషిపురా `కార్డెలియా జంప్‌సూట్‌`ను ధరించి ధూళిపాళ ఘ‌న‌మైన‌ పునరాగమనంతో ఆక‌ట్టుకుంది. శోభిత ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉంది.


అందాల క‌థానాయిక‌ కియారా అద్వానీ ఫ్రెంచ్ రివేరాలో డిజైనర్ ప్రబల్ గురుంగ్ నుండి డ్రేప్డ్ ఐవరీ క్రేప్ బ్యాక్ శాటిన్ డ్రెస్‌లో మొదటిసారి కనిపించింది. కేన్స్ లో మ‌రోసారి బాలీవుడ్ హాట్ గాళ్ ఊర్వశి రౌటేలా తన తొలి ప్రదర్శనతోనే హెడ్ ట‌ర్న‌ర్ గా మారింది. ఆ ఇద్ద‌రు హాట్ గాళ్స్ ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలామంది ఫిదా అయ్యారు. హీరామండిలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న అదితీరావ్ హైద‌రీ కేన్స్ ఉత్స‌వంలో ప్ర‌స్తుతం సంద‌డి చేస్తోంది. అదితీ ఫ్యాషన్ గేమ్ కి అద్భుత స్పంద‌న ద‌క్కుతోంది. అలాగే జాక్విలిన్ ఫెర్నాండెజ్ మ‌రోసారి అల్ట్రా గ్లామ‌ర‌స్ లుక్ తో ఆక‌ట్టుకున్నారు.


భారతీయ ప్రభావశీలులు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా రెగ్యులర్‌గా సంద‌డి చేస్తున్నారు. ఈ సంవత్సరం అనేక మంది భారతీయ ప్రభావశీలురు (ఇన్ ఫ్లూయెన్స‌ర్లు) వివిధ బ్రాండ్‌లకు ప్రాతినిధ్యం వహిస్తూ రెడ్ కార్పెట్‌పై నడుస్తున్నారు. అంకుష్ బహుగుణ, ఆర్జే కరిష్మా, నాన్సీ త్యాగి, నిహారిక, ఆస్తా షా తదితరులు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. వీరంతా రిపీటెడ్ గా వేదిక‌పై క‌నిపిస్తున్నారు.


కొత్త వాళ్ల‌కు ఛాన్స్:

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వర్ధమాన తార నాన్సీ త్యాగి, కేన్స్ 2024లో తన అరంగేట్రంతో అంద‌రిదృష్టిని ఆకర్షించింది. అద్భుతమైన పౌడర్ పింక్ గౌను ... ఎంబ్రాయిడరీ చీరలో ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. దేశంలో చెప్పుకోద‌గ్గ ఫ్యాషన్ శక్తిగా గుర్తింపు సంపాదించుకుంది. పంజాబీ సంగీత సంచలనం సునంద శర్మ కేన్స్ రెడ్ కార్పెట్ పై వెలుగులు విర‌జిమ్మింది. పంజాబీ సంస్కృతి కి చెందిన‌ కాలాతీత సౌందర్యాన్ని ఈ ఏదిక‌పై ప్ర‌ద‌ర్శించారు. ఎరుపు రంగు సూట్ .. ఐవరీ అనార్కలీ, సాంప్రదాయ బంగారు ఎంబ్రాయిడరీ ఉపకరణాలతో అలంకరించి రెడ్ కార్పెట్ పై ఎంతో అందంగా క‌నిపించింది.


భారతీయ ఫ్యాషన్ ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేయడం కొనసాగిస్తున్నందున కేన్స్ 2024లో ఈ తారల శైలి గొప్ప‌త‌నం హైలైట్ అయింది. ప్ర‌తి ప్రదర్శనతో వారు ఫ్యాషన్ గేమ్ సరిహద్దులను పునర్నిర్వచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులపై శాశ్వత ముద్ర వేస్తున్నారు.