విదేశీ పౌరులే అయినా భారతసినీపరిశ్రమను ఏలారు
భారతదేశంలో స్టార్ డమ్ అందుకున్న పలువురు విదేశీ తారలకు ఇప్పటికీ మన దేశ పౌరసత్వం లేదు
By: Tupaki Desk | 16 Aug 2023 7:48 AM GMTభారతదేశంలో స్టార్ డమ్ అందుకున్న పలువురు విదేశీ తారలకు ఇప్పటికీ మన దేశ పౌరసత్వం లేదు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏలారు. ఖిలాడీ అక్షయ్ కుమార్ ద్వంద్వ పౌరసత్వం నుంచి మారి ఇప్పుడు పూర్తిగా భారతీయ పౌరుడిగా మారాడు. 'కెనడియన్ కుమార్' అన్న విమర్శకు ప్రాక్టికల్ గా చెక్ పెట్టిన నేపథ్యంలో ఇంకా ఎవరెవరు విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు? అన్నది ఆరా తీస్తే.... దాదాపు డజను పైగా భారతీయ పౌరసత్వం లేని తారలు దేశంలో స్టార్లుగా ఏల్తున్నారు.
ఆలియా భట్
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత మహేష్ భట్ కుమార్తెగా ఆలియా సుపరిచితం. ఆర్.ఆర్.ఆర్ స్టార్ గా సౌత్ కి కూడా పరిచయమైంది. పాన్ ఇండియా స్టార్ గా జేజేలు అందుకుంటోంది. అలియా భట్ వాస్తవానికి బ్రిటిష్ పౌరురాలు. ఆమె తల్లి సోనీ రజ్దాన్ బ్రిటన్ లో ఉన్నందున అలియా భారత పౌరసత్వం పొందేందుకు అర్హత పొందలేదు.
కత్రినా-కైఫ్
అందాల సుందరి కత్రినా కైఫ్ బాలీవుడ్ లో స్థిరపడిన విదేశీగా అందరికీ సుపరిచితం. హాంకాంగ్ లో కాశ్మీరీ తండ్రికి జన్మించిన ఈ బ్యూటీ తన తల్లి మూలాల నుండి వచ్చిన బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది. తను భారతీయురాలు కాలేదు.
దీపికా పదుకొనే
ప్రస్తుతం టాప్ బాలీవుడ్ నటీమణులలో దీపికా పదుకొణె పాపులారిటీ అంతా ఇంతా కాదు. తన పౌరసత్వం గురించి రకరకాల వాదనలు ఉన్నాయి. అద్భుతమైన నటి.. నర్తకిగా.. అందగత్తెగా.. దీపికకు విదేశీ పౌరసత్వం ఉందని చెబుతారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణె కుమార్తె ఆమె. డెన్మార్క్ లో జన్మించింది. కాబట్టి దీపిక బెంగుళూరులో పెరిగినా డానిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది.
ఇమ్రాన్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడు. అమెరికాలోని విస్కాన్సిన్ లోని మాడిసన్ లో జన్మించిన ఇమ్రాన్ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత తన తల్లితో కలిసి ముంబైకి వెళ్లారు. ఇమ్రాన్ తన అమెరికన్ పాస్ పోర్ట్ ను వదులుకోవాలని కోరుకుంటే 10 సంవత్సరాల విలువైన పన్నును ముందుగానే అమెరికా ప్రభుత్వానికి చెల్లించాలి.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతోంది. కానీ ఇప్పటికీ ఆమెకు భారతీయ పౌరసత్వం లేదు. 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక అందాల పోటీ విజేత అయిన జాక్వెలిన్ బహ్రెయిన్ లో జన్మించినప్పటికీ చాలా వరకు శ్రీలంక పౌరురాలిగానే ఉంది.
కల్కీ కోచ్లిన్
కల్కీ కోచ్లిన్ బాలీవుడ్ లో డ్యాషింగ్ పెర్ఫామర్ గా సుపరిచితం. కొన్ని అసాధారణ పెర్ఫామెన్సెస్ తో కల్కి తనదైన మార్క్ వేసింది. అయితే ఈ బ్యూటీ భారతీయ పౌరురాలు కాదు. ఆమె భారతదేశంలోని పుదుచ్చేరిలో జన్మించినప్పటికీ తన ఫ్రెంచ్ తల్లిదండ్రుల సంతతికి చెందినందున ఆమె ఫ్రెంచ్ పాస్ పోర్ట్ లను కలిగి ఉంది.
ఫవాద్ ఖాన్
ఫవాద్ 2014లో బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటి నుండి అతడి రూపానికి సమ్మోహనులై పరిశ్రమ అవకాశాలిస్తోంది. హాట్ లుక్ తో ఇంటెన్స్ గా కనిపించే అతడు పాకిస్తాన్ పౌరుడు. అతని షార్ప్ ముఖకవళికలు పాకిస్తానీ వంశానికి చెందిన జీన్స్ ని బహిర్గతం చేస్తుంటాయి. అందుకే అతడు పాకిస్తాన్ కి రుణపడి ఉన్నాడు. అక్కడి పాస్ పోర్ట్ మాత్రమే ఉంది.
సన్నీ లియోన్
మాజీ అడల్ట్ స్టార్ .. నేటి ప్రధాన స్రవంతి బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కెనడియన్-అమెరికన్ జాతీయతకు చెందినది. అమెరికన్ పౌరసత్వం కలిగి ఉంది. భారతదేశానికి చెందిన విదేశీ పౌరురాలుగా సుపరిచితం. సన్నీ లియోన్ అసలు పేరు కరెన్జిత్ కౌర్.
నర్గీస్ ఫక్రి
నర్గీస్ ఫక్రీ బహుళ జాతీయతలను కలిగి ఉన్న నటి. పాకిస్తాన్ తండ్రి చెక్ దేశానికి చెందిన తల్లికి జన్మించిన ఫక్రీ అమెరికన్ మోడల్ గా కెరీర్ ని సాగించింది. అమెరికన్ పౌరసత్వం కలిగి ఉంది. ఈ నటి ప్రముఖ నిర్మాత తనయుడు ఉదయ్ చోప్రాతో డేటింగ్ చేసిందని కథనాలొచ్చాయి.
ఈవెలిన్ శర్మ
బాలీవుడ్ లో కెరీర్ సాగిస్తున్న ఎవెలిన్ శర్మ పంజాబీ తండ్రి - జర్మన్ తల్లికి జన్మించిన జర్మన్ మోడల్. విదేశీ పాస్ పోర్ట్ ని మాత్రమే కలిగి ఉంది.
అలీ జాఫర్
చిరునవ్వు ముఖంతో ప్రశాంతమైన ప్రవర్తనతో అలీ జాఫర్ ఎప్పుడూ ఆకట్టుకుంటారు. అతనికి బాలీవుడ్ లో అభిమానులను సంపాదించిపెట్టింది అతడి యాటిట్యూడ్. సదరు నటుడు కం గాయకుడు పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తి.
మోనికా డోగ్రా
యుఎస్ లో జన్మించిన భారతీయ-అమెరికన్. నటిగా - గాయనిగా బాలీవుడ్ లో ఎదుగుతున్న మోనికా డోగ్రా ఇన్ స్టాగ్రామ్ స్టార్ గా సుపరిచితం. 2011 చిత్రం ధోబి ఘాట్ లోనూ నటించింది.
సప్న-పబ్బి
ఖామోషియాన్ ఫేమ్ సప్నా పబ్బి లండన్‌కు చెందిన యువతి. బ్రిటిష్ పాస్ పోర్ట్ కలిగి ఉన్నారు. భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వం నిషేధించినందున పబ్బి భారతీయ పౌరురాలిగా ఉండకూడదు.
బార్బరా మోరి
కైట్స్ చిత్రంలో బాలీవుడ్ హార్ట్ థ్రోబ్ హృతిక్ రోషన్ సరసన నటించిన బార్బరా మోరీ మెక్సికన్-ఉరుగ్వే ద్వంద్వ జాతీయతను కలిగి ఉంది. బార్బారాతో హృతిక్ రోషన్ ఎఫైర్ గురించి తెలిసినదే.
ఎల్లి అవ్రామ్
ఎల్లీ స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జన్మించారు- స్వీడిష్-గ్రీకు నటి ఎల్లీ అవ్రామ్ స్వీడిష్ జాతీయురాలు. ఆమె అసలు పేరు ఎలిసబెట్ అవ్రమిడౌ .. ఆమె విస్తృతంగా ప్రశంసలు పొందిన స్కాండినేవియన్ టాక్ షో స్కవ్లాన్ లో కూడా కనిపించింది. ఎల్లీ హాటెస్ట్ ఫోజులకు వెబ్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ నటిగా యువ క్రికెటర్ల గుండెల్లో గుబులు రేపడం ఈ అమ్మడి ప్రత్యేకత.
అమీ జాక్సన్- సారా జేన్ కూడా..
అక్షయ్ కుమార్ నటించిన సింగ్ ఈజ్ బ్లింగ్ లో తన యాక్షన్ అవతార్ తో మెరిపించిన అమీ జాక్సన్ బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఈ అందాల నటి యునైటెడ్ కింగ్ డమ్ లోని లివర్ పూల్ కు చెందిన నటీమణి. స్పష్టంగా బ్రిటిష్ పౌరసత్వాన్ని కలిగి ఉంది. తన లుక్స్ కూడా బ్రిటిష్ మూలాల్ని ప్రతిబింబిస్తాయి. అమీజాక్సన్ ప్రంపంచలోనే అత్యంత ధనవంతుడైన జార్జి పనాయటౌతో బ్రేకప్ అయ్యాక ప్రస్తుతం ప్రముఖ మోడల్ తో సహజీవనం సాగిస్తోంది. ఇంతకుముందు జార్జితో ఎల్లీ ఒక బిడ్డను కూడా కంది. ఫెమినా మిస్ ఇండియా 2007 విజేత సారా జేన్ డయాస్ మూలం మస్కట్ ఆఫ్ ఒమన్ లో ఉంది. రోమన్ క్యాథలిక్ తల్లిదండ్రులకు జన్మించిన సారా మోడలింగ్ లో తన పనిని కొనసాగించిన తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టింది. సారా ఇప్పటికీ విదేశీ వనిత..
అక్షయ్-కుమార్
బాలీవుడ్ ఫిట్ నెస్ ఔత్సాహికుడు అక్షయ్ కుమార్ కూడా భారతీయ పౌరుడు కాదు. అతను పంజాబ్ లోని అమృత్ సర్ లో రాజీవ్ హరి ఓం భాటియాగా జన్మించాడు. ఢిల్లీలో పెరిగాడు. అతను కెనడియన్ పాస్ పోర్ట్ ని కలిగి ఉన్నాడు. గౌరవ కెనడియన్ పౌరసత్వాన్ని అంగీకరించిన తర్వాత అక్షయ్ తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. మళ్లీ ఇటీవలే కెనడియన్ పౌరసత్వాన్ని వదులుకుని భారతీయుడిగా మారాడు. అతడి పౌరసత్వానికి సంబంధించిన పత్రాలు ఇండిపెండెన్స్ డే రోజన అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.