మన షార్ట్ ఫిల్మ్ కేన్స్ లో నెం.1
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మరియు ఫిల్మ్ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా జరుగుతోంది.
By: Tupaki Desk | 24 May 2024 8:05 AM GMTప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు మరియు ఫిల్మ్ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రాన్స్ వేదికగా జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండియన్స్ సత్తా చాటారు. మొదటి సారి మన షార్ట్ ఫిల్మ్ కు మొదటి బహుమతి లభించింది.
'సన్ ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' అనే ఇండియన్ షార్ట్ ఫిల్మ్ కి కేన్స్ లో నెం.1 స్థానం దక్కింది. కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో రూపొందిన 17 చిత్రాలతో పోటీ పడి నెం.1 గా నిలవడం విశేషం.
ఒక వృద్ధురాలు ఎంతో ప్రేమగా పెంచుకునే కోడి మిస్ అవుతుంది. ఆ కోడి ఎటు వెళ్లింది, దాంతో ఆ వృద్దురాలి మనో వేదన ఏంటి అనే విషయాలను షార్ట్ ఫిల్మ్ లో దర్శకుడు అద్భుతంగా చూపించి హృదయాలను కదిలించాడు. అందుకే నెం.1 గా ఈ షార్ట్ ఫిల్మ్ నిలిచింది.
16 నిమిషాల నిడివితో వచ్చిన ఈ షార్ట్ ఫిల్మ్ లో ఎన్నో ఎలిమెంట్స్ ను మేకర్స్ చూపించి అంతర్జాతీయ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. కేన్స్ లో నెం.1 గా నిలిచినందుకు గాను 15000 యూరోలను యూనిట్ సభ్యులకు నిర్వాహకులు ఇచ్చారు.
అంతర్జాతీయ వేదిక పై మన ఇండియన్ షార్ట్ ఫిల్మ్ సత్తా చాటడం పట్ల నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ షార్ట్ ఫిల్మ్ గురించి వెతుకుతూ ఉన్నారు. ఇప్పటికే పలు అవార్డులు ఈ మేకర్స్ దక్కించుకున్నారు.