Begin typing your search above and press return to search.

జోరు వర్షంలో 'ఇంద్ర' హీట్‌

కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవ్వకుండా బెంగళూరు ఇంకా పలు ముఖ్య నగరాలు పట్టణాల్లో కూడా ఇంద్ర రీ రిలీజ్ అయ్యింది.

By:  Tupaki Desk   |   22 Aug 2024 5:17 PM GMT
జోరు వర్షంలో ఇంద్ర హీట్‌
X

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. మెగా ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, ఇంద్ర రీ రిలీజ్ అవ్వడంతో ఎక్కడ చూసినా కూడా చిరంజీవి పేరు వినిపిస్తూ, కనిపిస్తోంది. ముఖ్యంగా ఇంద్ర సినిమా రీ రిలీజ్ హంగామా మామూలుగా లేదు. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవ్వకుండా బెంగళూరు ఇంకా పలు ముఖ్య నగరాలు పట్టణాల్లో కూడా ఇంద్ర రీ రిలీజ్ అయ్యింది. రికార్డ్‌ స్థాయి లో ఎక్కువ సింగిల్ స్క్రీన్ లలో ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడం జరిగింది.

380 కి పైగా థియేటర్‌ లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్ వారు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సాధారణంగా రీ రిలీజ్ శనివారం లేదా ఆదివారం అయితే ఎక్కువగా వసూళ్లు నమోదు అవుతాయి. కానీ నేడు గురువారం అయినా కూడా ఇంద్ర సినిమా కు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయ్యాయి. అత్యధిక సింగిల్ స్క్రీన్ లతో పాటు పలు మల్టీప్లెక్స్ ల్లో కూడా ఈ సినిమాను రీ రిలీజ్ చేయడం వల్ల అత్యధిక వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నేడు ఉదయం నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినా కూడా మెగా ఫ్యాన్స్ ఇంద్ర సినిమా కి హీట్ పెంచారు.

ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్‌ లోని అన్ని థియేటర్‌ లలో కూడా ఇంద్ర సినిమా కోసం తెల్లవారు జామునే ఫ్యాన్స్ బారులు తీరారు. పెద్ద నగరాలు పట్టణాలు మాత్రమే కాకుండా చిన్న మున్సిపాలిటీల్లో కూడా ఇంద్ర సందడి చేశాడు. 22 ఏళ్ల తర్వాత వచ్చిన ఇంద్ర ను చూసేందుకు కుర్రాళ్లు మాత్రమే కాకుండా అప్పటి కుర్రాళ్ళు, ఇప్పటి అంకుల్స్ కూడా థియేటర్ల ముందు బారులు తీరారు. సాధారణంగా రీ రిలీజ్ అటే కుర్రకారు ఎక్కువగా ఉంటారు. కానీ ఇంద్ర సినిమాను చూసేందుకు నాలుగు, అయిదు పదుల అంకుల్స్ కూడా థియేటర్ల ముందు నిలబడటం కనిపించింది.

చిరంజీవి మాట్లాడుతూ ఇంద్ర సినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సినిమా అన్నారు. సినిమాలోని ఏ సీన్ చూసినా కూడా మొత్తం సినిమా చూడాలి అనిపించేంత బాగుంటుంది. అందుకే 22 ఏళ్ల తర్వాత కూడా ఇంద్ర సినిమాకు ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అన్నారు. నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడుతూ ఇంద్ర వంటి అద్భుతమైన కమర్షియల్‌ సినిమా నిర్మించే అవకాశం రావడం నా అదృష్టం. చిరంజీవి తో మరో సినిమాను చేయాలని ఎదురు చూస్తున్నాను. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు.