Begin typing your search above and press return to search.

మ‌హేష్ కోసం ఇండోనేషియా అందమా!

ఈసారి టెక్నిక‌ల్ టీమ్ లో భారీ ఎత్తున ప్ర‌క్షాళ‌న కూడా చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   11 Feb 2024 12:05 PM GMT
మ‌హేష్ కోసం ఇండోనేషియా అందమా!
X

# ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ప‌నుల్లో ఎవ‌రికి వారు బిజీ అయిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ జ‌ర్మ‌నీ లో సినిమాకి కావాల్సిన ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగొచ్చాడు. మ‌రోవైపు రాజ‌మౌళి అండ్ కో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. స్క్రిప్ట్ సిద్ద‌మ‌వ్వ‌డంతో మిగ‌తా ప‌నుల‌పై రాజమౌళి దృష్టి పెట్టి ప‌ని చేస్తున్నాడు. ఈసారి టెక్నిక‌ల్ టీమ్ లో భారీ ఎత్తున ప్ర‌క్షాళ‌న కూడా చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.


'ఈగ‌'.. 'బాహుబ‌లి'..' ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాల‌కు ప‌నిచేసిన కొంత మంది టెక్నీషియ‌న్ల‌ను తెప్పించి అవ‌స‌రం మేర విదేశాల నుంచి హాలీవుడ్ బృందాన్ని రంగంలోకి దించుతున్నారు. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెం చ‌ర్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో క‌థ అంతా సాగ‌డంతో? అందుకు త‌గ్గ‌ట్టు అన్ని ర‌కాలుగా అంతా ఫిట్ అవుతారా? లేదా? అని భావించి రాజ‌మౌళి ఈ ర‌క‌మైన నిర్ణ‌యంతో ముందుకెళ్తున్నారు. ఇక సినిమాలో మ‌హేష్ కి జోడీగా ఏ హీరోయిన్ ని ఎంపిక చేస్తారు? అన్న‌ది హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ భామ‌ని దించుతారా? హాలీవుడ్ నే దించేస్తారా? అని ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప థ్యంలోనే ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. చెల్సియాని తీసు కుంటార‌నే ప్ర‌చారం కొన్ని రోజుల‌గా సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతుంది. తాజాగా ఆ ప్ర‌చారానికి ఈ స‌న్నివేశం మ‌రింత బ‌లం చేకూర్చింది. చెల్సియా సోష‌ల్ మీడియాలో రాజ‌మౌళిని మాత్ర‌మే ఫాలో అవుతున్నారు.

దీంతో ఆమె ఎంపిక ఖ‌రారైందా? అందుకే ఆమె జ‌క్క‌న్నని ఫాలో అవుతుందా? అన్న సందేహాలు మొద‌ల య్యాయి. అయితే మ‌హేష్ ని మాత్రం అనుస‌రించ‌లేదు. అలాగే బాలీవుడ్ హీరోయిన్లు దీపికా ప‌దుకొణే.. దిశా ప‌టానీల‌ను కూడా ఫాలో అవుతుంది. వీళ్లిద్ద‌రు కూడా `కల్కీ 2898`లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇలా టాలీవుడ్ తో సంబంధం ఉన్న ముగ్గుర్ని వ్య‌క్తుల్ని చెల్సియా అనుస‌రించ‌డం నెట్టింట ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి సూప‌ర్ స్టార్ కి జోడీ ఆమె అవుతుందా? అన్న‌ది క‌న్ప‌మ్ అవ్వాల్సి ఉంది.