పెళ్లి చేయమని పిల్లలడిగితేనే చేస్తా..లేకపోతే చెయ్యను!
పిల్లల బాధ్యత తల్లిదండ్రులది. పెరిగి పెద్దయ్యాక వాళ్ల జీవితాలు స్థిరపడేలా చేసే వరకూ ఏ తల్లిదండ్రులు పిల్లల చేతులు వదలడానికి ఇష్టపడరు.
By: Tupaki Desk | 26 Dec 2024 8:30 PM GMTపిల్లల బాధ్యత తల్లిదండ్రులది. పెరిగి పెద్దయ్యాక వాళ్ల జీవితాలు స్థిరపడేలా చేసే వరకూ ఏ తల్లిదండ్రులు పిల్లల చేతులు వదలడానికి ఇష్టపడరు. స్కూల్, కాలేజ్,ఆపై చదువులు, మంచి ఉద్యోగం, స్థాయికి తగ్గ వాళ్లను చూసి పెళ్లి చేయడం. అలా వాళ్లకంటూ ఓ జీవితాన్ని ఇవ్వడం. ఇదంతా తల్లిదండ్రులు బాధ్యతగా భావిస్తారు. అయితే పెళ్లి చేసే బాధ్యత మాత్రం నాది కాదంటున్నారు నటి ఇంద్రజ. ఆమెకు కుమారుడు, కుమార్తె గలరు.
అయితే వీరి పెళ్లి విషయంలో తాను బాధ్యత తీసుకోవాలనుకుంటే? మాత్రం కూతురైనా..కొడుకైనా సరే తన దగ్గర కొచ్చి పెళ్లి చేయండని అడిగితే మాత్రమే ఆ ఛాయిస్ తీసుకుంటారుట. లేదంటే? తమ స్వేచ్ఛకే ఆ విషయాన్ని వదిలేస్తానన్నారు. పెళ్లి పేరుతో తల్లిదండ్రులుగా ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదన్నారు. వాళ్లకంటూ కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. జనరేషన్ మారింది.
మంచి ..చెడు ఆలోచించే వయసు వచ్చింది. ఆ స్థాయికి ఎదిగారు. అలాంటప్పుడు వాళ్ల ఇష్టాలను గౌరవించ కుండా పెళ్లి వయసు వచ్చిందని వాళ్ల అనుమతి లేకుండా? ఛాన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదు అన్నది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ఇంద్రజ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇంద్రజ తరహాలోనే నటుడు జగపతి బాబు కూడా పిల్లలకు అంతే స్వేచ్ఛ ఇచ్చినట్లు గతంలో ఆయన వ్యాఖ్యా నించారు. పిల్లలు తమ పెళ్లిళ్లు తామే చేసుకోవాలని, తాను మాత్రం పెళ్లి చేయనని చెప్పినట్లు తెలిపారు. ఇప్పటికే జగపతి బాబు కుమార్తె ఒకరు విదేశీయుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.