Begin typing your search above and press return to search.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రి: కుమార్తె హ‌త్య కేసులో క‌ఠోర నిజం

మీ భ‌ర్త పీటర్ ముఖర్జీని ఉద్దేశించే మీరు ఇలా మాట్లాడుతున్నారా? అని అడిగినప్పుడు ``నేను ఇప్పుడే చెప్పకూడదు.

By:  Tupaki Desk   |   12 March 2024 3:41 AM GMT
మ‌ర్డ‌ర్ మిస్ట‌రి: కుమార్తె హ‌త్య కేసులో క‌ఠోర నిజం
X

తన కుమార్తె షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జీ.. షీనా బోరాకు ఏం జరిగిందో తన కుటుంబ సభ్యులకు తెలుసని, వారిని చిక్కుల్లో పడేసేందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, పరోక్షంగా తన మాజీ భర్త పీటర్ ముఖర్జీని ఉద్దేశించి పేర్కొన్నారు. ప్ర‌ముఖ జాతీయ మీడియాకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇంద్రాణి ముఖర్జియా తన వాదనను నిరూపించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని వాటిలో చాలా వరకు ఇప్పటికే కోర్టుకు సమర్పించాన‌ని తెలిపారు.

2012లో తప్పిపోయిన తన కుమార్తె షీనా బోరాకు ఏం జరిగిందనే దాని గురించి ఇంద్రాణీని ప్ర‌శ్నించ‌గా.. ``షీనాకు ఏం జరిగిందో తెలిసిన వారు కుటుంబంలో ఉన్నారు``అని ఆమె చెప్పింది. ఈ వాస్తవం గురించి నాకు పూర్తిగా నమ్మకం ఉంది. వాస్తవానికి నేను ఆ మేరకు కోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేసాను. కానీ నా దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేనంత వరకు నేను ఏమీ చెప్పదలచుకోలేదు``అని అన్నారు.

మీ భ‌ర్త పీటర్ ముఖర్జీని ఉద్దేశించే మీరు ఇలా మాట్లాడుతున్నారా? అని అడిగినప్పుడు ``నేను ఇప్పుడే చెప్పకూడదు. కానీ క‌చ్చితంగా నేను నమ్మడానికి కారణాలు ఉన్నాయి``. ఇప్పటికే రికార్డుల్లోకి వచ్చిన తగినన్ని సాక్ష్యాలు ఉన్నాయి. మా రక్షణ కోసం తెచ్చే మరిన్ని ఆధారాలు ఉన్నాయి`` అని అన్నారు.

ఇంద్రాణి -పీటర్ 2002లో వివాహం చేసుకున్నారు. 2017లో విడాకులు తీసుకున్నారు. పీటర్ ముఖర్జీ, స్టార్ ఇండియా - INX మీడియాల్లో ప‌ని చేసే మీడియా బారన్. ఈ విడాకుల కంటే ముందే సిద్ధార్థ దాస్‌తో మొదటి వివాహం నుండి ఇంద్రాణి కుమార్తె షీనా.

డాక్యు సిరీస్:

52 ఏళ్ల ఇంద్రాణీ ముఖర్జీ, కొత్త నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ `ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్` విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. సిబిఐ ఈ సిరీస్ విడుదలను వ్యతిరేకించింది.. అయితే బొంబాయి హైకోర్టు అనుమతించడంతో చివరకు ఫిబ్రవరి 29 న ప్రసారం మొద‌లైంది.

2015లో కనుగొన్న‌ మృతదేహం నమూనాలతో సరిపోలిన DNA ఫలితాలకు సంబంధించి, ఇంద్రాణి మాట్లాడుతూ నివేదిక నకిలీదని DNA నిపుణుడు స్వయంగా కోర్టులో నిలదీశారని చెప్పారు. కేసు వివ‌రాల్లోకి వెళితే.. మొదటి శరీరం 2012లో కనుగొన్నారు. దానికి సంబంధించిన DNA నివేదిక లేదు. 2015లో మరో మృతదేహం లభ్యమైంది. రక్త నమూనాతో సరిపోలిన DNA పరీక్ష జరిగింది. డిఎన్‌ఎ నిపుణులు నిలదీయడానికి వచ్చినప్పుడు అది పూర్తిగా భిన్నమైనదని తేలింది. ఎలెక్ట్రోఫెరోగ్రామ్ యుగ్మ వికల్ప సంఖ్యలను మార్చినట్లు అతడు అంగీకరించినందున, చివరికి అది పోలిక స‌రిపోయింది`` అని ముఖర్జీ చెప్పారు. తాజాగా మ‌రోసారి పరీక్షను డిమాండ్ చేయకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ విచారణ ఇప్పటికే పూర్త‌యింది.. అని ఆమె చెప్పారు.

షీనా బోరాను 2012 ఏప్రిల్‌లో ఇంద్రాణి ముఖర్జీ, ఆమె అప్పటి డ్రైవర్ శ్యాంవర్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నా కలిసి కారులో గొంతుకోసి హత్య చేశారు. అనంత‌రం మృతదేహాన్ని మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని అడవిలో కాల్చివేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. 2015లో మరో కేసులో అరెస్టయిన తర్వాత హత్య చేసిన విషయాన్ని రాయ్ వెల్లడించడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది.

ఇంద్రాణి ముఖర్జియా ఆగస్ట్ 2015లో అరెస్టు అయింది. మే 2022లో బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో ఇతర నిందితులు రాయ్, ఖన్నా, పీటర్ ముఖర్జీ కూడా బెయిల్‌పై బయట ఉన్నారు.

ఈ కేసులో విచారణ చివరి దశలో ఉంది.