పిలుస్తారు..వెళ్లాలా? వద్దా? అన్నది మన ఇష్టమే!
కొంత మంది కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. మరికొంత మంది అలాంటిదేం లేదని ఖండించిన వారు ఉన్నారు
By: Tupaki Desk | 31 July 2024 7:30 AM GMTబాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశంపై నిత్యం ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. దీనిపై పెద్ద ఉద్యమమే జరిగినా కాస్టింగ్ కౌచ్అదుపులోకి వచ్చిందా? అంటే అదెక్కడా కనిపించదు. ప్రెష్ గా కొత్త బాధితులు తెరపైకి వస్తూనే ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ అన్నది ఇక్కడే కాదు అన్ని కార్పోరేట్ రంగాల్లోనూ ఉన్నదే. ఈ అంశంపై ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు ఎవరి అభిప్రాయాల్ని వారు పంచుకున్నారు.
కొంత మంది కాస్టింగ్ కౌచ్ ఉందన్నారు. మరికొంత మంది అలాంటిదేం లేదని ఖండించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మితా తన అనుభవాలు పంచుకుంది. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే దీని గురించి విన్నా. చాలా మంది వ్యక్తులు వాళ్లకు నచ్చినట్లు కథలు చెప్పేవారు. అప్పటికి నేను మోడల్ గా ఉన్నా యాక్టింగ్ వైపు రాలేదు.
మీరు వాళ్లు చెప్పినట్లు చేయకపోతే అవకాశాలు రావని మోడలింగ్ రంగంలో అనుభవం గలవారు చెప్పేవారు. కానీ నేను అదొక్కటే మార్గం అనుకోలేదు. ఆ సమయంలో కొందరు కాస్టింగ్ డైరెక్టర్స్ నన్ను పర్సనల్ గా కలవమనేవారు. కానీ వాళ్లెవ్వరు బలవంతం చేయలేదు. వాళ్ల మనసులో ఉన్న కోరికను ఆ రూంపలో వ్యక్త పరిచేవారు అంతే. వెళ్లాలా? వద్దా? అన్నది మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది.
సినిమాల్లోనే కాదు..కార్పోరేట్ రంగంలోనూ ఇలాగే ఉంటుంది. వాళ్లు పిలిచారని వాళ్లను చెడ్డవారిగా చూడాల్సిన పనిలేదు. వెళ్లలేదు అంటే వాళ్లేమి ఇబ్బంది పెట్టరు. ఎవరి పని వాళ్లు చూసుకుంటారు` అని తెలిపింది. ఐశ్వర్య సుస్మిత కూడా కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్. అదే అమ్మడికి తొలి అవకాశం . అక్కడ నుంచి సినిమాల్లోకి వచ్చింది.