Begin typing your search above and press return to search.

రెడ్ కలర్ డ్రెస్సులో ఘాటైన గ్లామర్

దీంతో చాలా మంది బ్యూటీలు.. దర్శక నిర్మాతల దృష్టి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:33 PM GMT
రెడ్ కలర్ డ్రెస్సులో ఘాటైన గ్లామర్
X

ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో అందాల ఆరబోత మామూలుగా ఉండడం లేదు. హీరోయిన్స్ తోపాటు సీరియల్ నటీమణులు, యాంకర్స్.. అలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది స్కిన్ షో చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అనేక మంది హీరోయిన్లు వెలుగులోకి కూడా వస్తున్నారు. దీంతో చాలా మంది బ్యూటీలు.. దర్శక నిర్మాతల దృష్టి తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


అనసూయ, రష్మి, విష్ణుప్రియ, శ్రీముఖి వంటి పలువురు యాంకర్లకు ఇన్‌ స్టాగ్రామ్‌ లో లక్షల ఫాలోవర్లు ఉన్నారు. ఇక సీరియల్ నటీమణులు తక్కువేం కాదు. గుప్పెడంత మనసు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో దగ్గరైంది జగతి అలియాస్ జ్యోతి రాయ్. సీరియల్ లో సంప్రదాయ కట్టు బొట్టుతో కనిపిస్తుండే ఈ బ్యూటీ.. బయట మాత్రం హద్దులు దాటి మరీ అందాలు ఆరబోస్తోంది. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఇన్ స్టా చూస్తే మాత్రం ప్రజలు షాక్ అవ్వాల్సిందే.


గత కొద్ది రోజులుగా గ్లామర్ డోస్ పెంచేసింది జ్యోతి రాయ్. ట్రెండీ ఔట్ ఫిట్లలో రకరకాల పోజులు ఇస్తూ స్పైసీ ట్రీట్ ఇస్తోంది. డైలీ కొత్త కొత్త ఫొటోలను పోస్ట్ చేస్తోంది. రోజూ తన ఇన్ స్టా వాల్ చెక్ చేయాలనిపించేలా సందడి చేస్తోంది. రోజురోజుకు ఫాలోవర్స్ పెంచుకుంటోంది. తన అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ఇటీవల రెడ్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. సన్ గ్లాసెస్ తో పోజు ఇచ్చి నెట్టింట హీట్ పుట్టించింది.

ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. అందానికే ఇమేజ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అమ్మడు పోస్ట్ ను రీ షేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. జ్యోతి గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ.. కన్నడ యంగ్ డైరెక్టర్ పూర్వాజ్ ను పెళ్లి చేసుకున్నట్లు పరోక్షంగా తెలిపింది.

మరోవైపు, గుప్పెడంత మనసు సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన జ్యోతి రాయ్.. పలు వెబ్ సిరీసులు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. తన భర్త పూర్వాజ్ తెరకెక్కిస్తున్న మాస్టర్ పీస్ అనే సినిమాతో పాటు.. ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈమె కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.