Begin typing your search above and press return to search.

గేమ్ చేంజర్.. షార్ట్ టెంపర్ హీరో?

ఇదిలా ఉంటే ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడో ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 3:40 AM GMT
గేమ్ చేంజర్.. షార్ట్ టెంపర్ హీరో?
X

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మూవీ కంప్లీట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్ళపాటు ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీకి డిసెంబర్ లో మోక్షం రానుందని మేకర్స్ ప్రకటనతో స్పష్టం అయ్యింది. అయితే ‘గేమ్ చేంజర్’ సినిమాపై చాలా తక్కువ బజ్ ఉంది. సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్, పోస్టర్స్ ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్ ని మెప్పించలేదు.

అసలు సినిమా కంటెంట్ ఎలా ఉంటుందనేది కూడా పూర్తిగా తెలియదు. రామ్ చరణ్ ఈ చిత్రంలో తండ్రికొడుకులుగా నటించాడనే విషయం తెలిసింది. ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా మరో క్యారెక్టర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ రెండు పాత్రలతో ఎలాంటి కథాంశం శంకర్ చెప్పబోతున్నాడో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పబ్లిక్ లో ఉంది. ‘జెంటిల్మన్’, ‘ఒకే ఒక్కడు’ సినిమాల తరహాలో ప్యూర్ సోషల్ ఎలిమెంట్ తో మూవీ ఉంటుందనే ప్రచారం అయితే నడుస్తోంది.

కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకి కథ అందించాడు. రామ్ చరణ్ కి పెర్ఫెక్ట్ గా సెట్ అయ్యే స్టోరీతో ‘గేమ్ చేంజర్’ సిద్ధం అవుతోందని గతంలో కార్తీక్ సుబ్బరాజు అన్నారు. అలాగే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉంటాయని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రెండు, మూడు సార్లు వేర్వేరు మూవీ ఈవెంట్స్ లలో క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో సాంగ్స్ హైలైట్ గా ఉంటాయని అన్నారు. కానీ మొదటి సాంగ్ పెద్దగా మెప్పించలేదు. సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుందనేది సరైన అప్డేట్ లేదు.

ఇదిలా ఉంటే ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఇప్పుడో ఇంటరెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మూవీలో యంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ కి షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుందంట. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడం కోసం మరింత పవర్ఫుల్ గా మారాలని అనుకుంటాడట. ముఖ్యంగా ఒక ఎపిసోడ్ లో ఐపీఎస్ ఆఫీసర్ గా ఉంటూ ఐఏఎస్ కి సిద్ధమయ్యే వాడిగా కనిపిస్తాడని ప్రచారం నడుస్తోంది. షార్ట్ టెంపర్ ఉన్నవాడు రాజకీయాలని ఏ విధంగా ప్రక్షాళన చేసాడనేది మూవీలో ఇంటరెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు.

మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది పూర్తిగా తెలియదు. నిజంగా రామ్ చరణ్ క్యారెక్టర్ కి షార్ట్ టెంపర్ ఉంటే ఎమోషన్స్ బాగా పండుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ‘గేమ్ చేంజర్’ తో రామ్ చరణ్ కి పాన్ ఇండియా లెవల్ లో ఒక సాలిడ్ హిట్ పడాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.