కమల్ హాసన్ హాకీ-క్రికెట్ ప్లేయర్!
మరి అలాంటి లెజెండరీ నటుడి గురించి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి.
By: Tupaki Desk | 22 July 2024 12:30 AM GMTవిశ్వనటుడిగా కమల్ హాసన్ అందరికీ తెలుసు. దేశమే గర్వించదగ్గ గొప్ప నటుడు. ఎన్ని పాత్రలైనా.. ఎలాంటి పాత్రలైనా అవలీలగా పోషించగల ఒకే ఒక్కడు. అందుకే 'దశావతారం' లాంటి గొప్ప సినిమా ప్రేక్షకులు చూడగలిగారు. 'భారతీయుడు'లో సేనాపతిని ఆస్వాదించాం. కమల్ నటుడే కాదు..గొప్ప దర్శకుడు అన్నది తెలిసిందే. ఆయన స్వీయా దర్శకత్వంలో విడుదలై 'విశ్వరూపం' ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచిన చిత్రంగా నిలిచింది.
అంతకు ముందు మరెన్నో సినిమాలు చేసారు. ఇలా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆరు దశాబ్ధలుగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకి సేవలందిస్తున్నారు. మరి అలాంటి లెజెండరీ నటుడి గురించి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. కమల్ హాసన్ కి హాకీ, క్రికెట్ అంటే ఎక్కువ ఇష్టమట. చిన్నప్పుడు ఆ రెండు ఆటలు ఎక్కువగా ఆడేవారుట. అదేంటో ఆయన మాటల్లోనే.. 'ఇంట్లో కూర్చుని ఆడే ఆటలు అస్సలు నచ్చవు.
ఎప్పుడు బయటకు వెళ్లి స్నేహితులతో హాకీ, క్రికెట్ ఆడేవాడిని. అలా ఎక్కువ మందితో ఆడే ఆటలు బాగా నచ్చేవి. జట్టులో ఎవరైనా తక్కువ అయితే కొత్త వారిని పరిచయం చేసుకుని ఆడించేవాడిని. వాళ్లతో స్నేహం చేయడం చాలా నచ్చేది. టీమ్ లో ఒకరికి కష్టం వచ్చిందంటే మిగతా వారంతా సహాయ పడేవాళ్లం. నా దృష్టిలో ఆటలంటే కేవలం సరదా వ్యాపకం కాదు. స్నేహ బంధాలు పెంపొందించేవి' అని అన్నారు.
క్రికెట్. హాకీ గేమ్ ల్ని అంతగా ఇష్టపడిన కమల్ హాసన్ ఇప్పుడు వాటిని పెద్దగా చూస్తున్నట్లు లేదు. అప్పుడప్పుడు క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ లకు వెళ్లడం తప్ప రెగ్యులర్ గా ఫాలో అవ్వడం లేదు. వాటి గురించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టరు. ఇక దేశ జాతీయ క్రీడ హాకీ అయినా ఈ క్రీడ గురించి అసలు చర్చే ఉండదు.