నటికి మధ్యంతర బెయిల్
అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదనే షరతును విధిస్తూ కోల్‌కతా లోని సిటీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
By: Tupaki Desk | 12 Dec 2023 5:43 AM GMTబాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఆ మధ్య ఓ వివిదాంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దుర్గామాత పూజలో పాల్గొంటానంటూ 12 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఆ వెంట్ కు హాజరుకాని కేసులో ఆరోపణలు ఎదుర్కుం టుంది. 2018 ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కేసు నడుస్తోంది. తాజాగా ఈ కేసులో అమ్మడికి మధ్యంత ర బెయిల్ లభించింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదనే షరతును విధిస్తూ కోల్‌కతా లోని సిటీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జరీన్ ఖాన్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత రూ.30000 వ్యక్తిగత బాండ్‌పై డిసెంబర్ 26 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తున్నామని.. కోల్‌కతా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీలులేదని కోర్టు ఆంక్షలు విధించింది. ఎప్పుడు పిలిచినా కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో జరీన్ ఖాన్ కి ఆ కేసు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించినట్లు అయింది.
ఐదేళ్ల క్రితం నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో జరీన్ ఖాన్‌పై ఈ చీటింగ్ కేసు నమోదయ్యింది. కోల్ కత్తాలో జరిగిన దుర్గామాతా పూజాకార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు నటి నిర్వాహకుల నుంచి 12 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఈ కార్యక్రమంలో జరీన్ ఖాన్ పాల్గొనకుండా తమని మోసం చేసిందని నిర్వాహకులు అగ్రహం వ్యక్తం చేసారు. జరీన్‌తోపాటు ఆమె మేనేజర్‌పై నార్కెల్‌దంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో జరీన్ ఖాన్ కి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సెప్టెంబర్ లో కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ కేసులేవి జరీన్ ఖాన్ వృత్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ఆమె బాలీవుడ్ లో యాధావిధిగా సిని మాలు చేసుకుంది. అయితే రెండేళ్లగా బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. దీంతో ఆ గ్యాప్ లో మ్యూజిక్ వీడియోలు చేసింది. అలాగే వెబ్ సిరీస్ ప్రయత్నాలు చేస్తోంది గానీ అమ్మడికి ఛాన్సులు మాత్రం రావడం లేదు.