OG: ఇదేదో బ్లాస్ట్ చేసే ప్లానే..
అయితే రీసెంట్ గా థాయ్ లాండ్ బ్యాక్ డ్రాప్ లో ఓజీ షూటింగ్ ని సుజిత్ స్టార్ట్ చేసాడంట.
By: Tupaki Desk | 13 Dec 2024 7:04 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. ఈ సినిమా షూటింగ్ ఇంకా 30 శాతం వరకు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబందించిన సన్నివేశాలు పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది ఆరంభంలో పవన్ కళ్యాణ్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేస్తాడని అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా థాయ్ లాండ్ బ్యాక్ డ్రాప్ లో ఓజీ షూటింగ్ ని సుజిత్ స్టార్ట్ చేసాడంట.
పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా సుజిత్ బ్యాంకాక్ లో హీరో ఎలివేషన్ సీన్స్ ని ప్రస్తుతం షూట్ చేస్తున్నారంట. హీరో లేకుండా అతని క్యారెక్టర్ ఎలివేషన్స్ కోసం ఈ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఇంటరెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అవుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సుజిత్ యూనివర్శల్ అప్పీల్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించారని తెలుస్తోంది.
సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ ఆ నటుల ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి ఓజీలో నటిస్తోన్న విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. వారిలో ఒకరు వితయ పన్ స్రింగార్మ్. థాయిలాండ్ కు చెందిన ఈ నటుడు ఓన్లీ గాడ్ ఫర్గివ్స్ ద్వారా ప్రేక్షకులకు చేరువ అయ్యాడు. 65 ఏళ్ళ వయస్సులో ఉన్న ఇతను థాయ్ చిత్రాలతో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ముప్పై ఏళ్ళకు పైగా మార్షల్ ఆర్ట్స్ లో ఇతనికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2014లో షాంగై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.
ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజైన డోంట్ కంలో మంచి క్యారెక్టర్ పోషించాడు. అలాగే జపాన్ కి చెందిన కజుకి కితామురా యాక్షన్ చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. కిల్ బిల్, గాడ్జిల్లా ఫైనల్ వార్స్, కిల్లర్స్, ప్యారాసైట్, హెల్ డాగ్స్, లెట్స్ గో కరోకే లాంటి సినిమాలలో కితామురా నటించారు. బెస్ట్ యాక్టర్ గా యోకోహోమా ఫిలిం ఫెస్టివల్ లో పురస్కారం దక్కించుకున్నాడు. ఇతను ఓజీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఇద్దరు కూడా థాయ్ లాండ్ లో జరిగే షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఫైట్ సీక్వెన్స్ కోసం కొంతమంది ఫైట్ మాస్టర్స్ ని కూడా బ్యాంకాక్ కి చెందిన వారిని తీసుకున్నారంట. ఇద్దరు హాలీవుడ్ యాక్టర్స్ ఓజీలో ఎంపిక చేయడం ద్వారా సినిమాపైన అంచనాలు పెరిగిపోయాయి. చూస్తుంటే యాక్షన్ సీన్స్ తో సుజిత్ ఏదో బ్లాస్టింగ్ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతుంది. ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలు క్రియేట్ చేస్తుందనేది వేచి చూడాలి.