Begin typing your search above and press return to search.

12 వ‌య‌సుకే గాయ‌నిగా దుమారం

12 వ‌య‌సుకే గాయ‌నిగా నిరూపించిన మేటి దేశీ అమ్మాయి ర‌వీనా మెహ‌తా. అంత‌ర్జాతీయ స్థాయి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుని ప్ర‌స్తుతం బాలీవుడ్ లో త‌న కెరీర్ ని కొన‌సాగిస్తోంది

By:  Tupaki Desk   |   27 Dec 2024 2:30 AM GMT
12 వ‌య‌సుకే గాయ‌నిగా దుమారం
X

12 వ‌య‌సుకే గాయ‌నిగా నిరూపించిన మేటి దేశీ అమ్మాయి ర‌వీనా మెహ‌తా. అంత‌ర్జాతీయ స్థాయి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకుని ప్ర‌స్తుతం బాలీవుడ్ లో త‌న కెరీర్ ని కొన‌సాగిస్తోంది. ద‌శాబ్ధ కాలంగా ర‌వీనా సినీరంగంలో కెరీర్ ర‌న్ ని కొన‌సాగించారు. UK దిగ్గజ సంగీత నిర్మాత రిషి రిచ్ .. ట్యాలెంటెడ్ కిరణీలతో పాటు ప‌ని చేసిన అనుభ‌వం ర‌వీనాకు ఉంది. తాజాగా ఈ కాంబినేష‌న్ రూపొందించిన‌ కొత్త సింగిల్ `మై దిల్ గోస్‌` యూత్ ని ఒక ఊపు ఊపుతోంది. ఈ ట్రాక్ Y2K నోస్టాల్జియా తో ఫ్రెష్ నెస్ తో ఆక‌ట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ పాట‌కు సంబంధించిన క్లిప్ లో ర‌వీనా మ‌త్తెక్కించే వాయిస్ యూత్ హృద‌యాల‌ను హ‌త్తుకుంటోంది.

2024 ముగింపున‌కు `మై దిల్ గోస్` సరైన ల‌వ్ సాంగ్. రిషి రిచ్‌తో నా విజ‌న్ కి ప్ర‌తీక‌గా నిలిచిందని, ఇప్పటికే మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో నిలిచిందని ర‌వీనా వెల్ల‌డించింది. ఇది పార్టీ గీతం. మిలీనియల్స్, జెన్ Z మధ్య వ‌య‌స్కుల‌కు అంద‌రికీ న‌చ్చుతుంది.. అని వెల్ల‌డించింది. కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెడుతున్న వేళ త‌న ఆల్బ‌మ్ తో ర‌వీనా యువ‌త‌రం ముందుకు వ‌చ్చింది. రవీనా మెహతా దశాబ్దపు సంగీత ప్రయాణం గురించి తెలుసుకోవలసిన విష‌యాలు చాలా ఉన్నాయి.

2010లో ఆల్బమ్ `ఫ్రమ్ డీప్ విత్ ఇన్` విడుదలతో 12 ఏళ్ల వయస్సులో గాయ‌నిగా ఆరంగేట్రం చేసింది. విద్యా విషయాలపై దృష్టి సారించడానికి కొంత విరామం తీసుకున్న మెహతా 2020లో `యాదీన్` పాట‌ను రిలీజ్ చేసి తిరిగి గాయ‌నిగా కంబ్యాక్ అయింది. ఈ పాట‌ సంగీత ప్రియుల‌ను గొప్ప‌గా అల‌రించింది. 2021లో వచ్చిన తొలి సింగిల్ కాసనోవాలో టైగర్ ష్రాఫ్‌తో కలిసి మహిళా వాయిస్ ని అందించింది.

వరుసగా నాలుగు సంవత్సరాలుగా పాపుల‌ర్ ఫిల్మ్ ఫెస్టివల్ కేన్స్‌లో రవీనా సంద‌డి చేస్తూనే ఉంది. రెడ్ కార్పెట్ వాక్ పరంగానే కాకుండా తన గానం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ర‌వీనా ప్రస్థానం విజయవంతమైంది. గౌరవనీయమైన దక్షిణాసియా బ్రాండ్ కోసం న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ రన్‌వేలపై ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన‌ ర‌వీనా భారతదేశ కళాత్మక ప్రతిభకు ప్రపంచదేశాల్లో ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. ఈ ప్ర‌తిభావ‌ని ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లోను గాయ‌నిగా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం.