అంతర్జాతీయ స్థాయిలో తనికెళ్ల భరణి కల ఒకటి!
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భరణి కలలో ఏకంగా అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఉందన్న విషయాన్ని రివీల్ చేసారు.
By: Tupaki Desk | 18 Sep 2023 12:30 AM GMTసీనియర్ నటుడు తనికెళ్ల కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. నాలుగు దశాబ్ధాల ప్రయాణంలో ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. నటుడిగా..ప్రతినాయకుడిగా...క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. అంతేనా ఆయన గొప్ప రచయిత కూడా. దర్శకుడిగానూ పనిచేసారు.
'మిథునం' లాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని చిత్రీకరించడం అన్నది ఓ కలగా భావించి కొన్నేళ్ల క్రితం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. అయితే దర్శకుడిగా ఆయన ప్రయాణం మాత్రం బిజీ కాలేదు. నటుడిగా వచ్చినన్ని అవకాశాలు దర్శకుడిగా రాలేదు. దీంతో నటనకే పరిమితయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భరణి కలలో ఏకంగా అంతర్జాతీయ ప్రాజెక్ట్ ఉందన్న విషయాన్ని రివీల్ చేసారు.
'దర్శకుడిగా నేను సినిమా చేసి పదేళ్లు అయింది. కథలు లేక కాదు.నేను కమర్శియల్ సినిమాలు చేయను. నా తరహా కళాత్మక సినిమాలు చేసే నిర్మాతలు కనిపించడం లేదు. ఓటీటీ వేదికలు నాలాంటి వాళ్లకు తలుపులు మూసేసాయి. కళలో కూడా హింస..అసభ్యత కనిపించాలంటున్నారు. నేను ద్వంద్వార్దాల నుంచి కూడా తప్పించుకుని వచ్చినవాడిని.
మరి కళాత్మక సినిమాలు చేసే పరిస్థితులు ఇక లేవా? అనే ప్రశ్న వస్తుందేమో. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. సాత్వికమైన సినిమా అద్బుతంగా ఆడిందనుకో మళ్లీ అందరూ అలాంటి సినిమాలపైనే పడతారు. పరిశ్రమ ఎప్పడూ సక్సెస్ వెంటే కదా నడుస్తుంది' అని అన్నారు.
ప్రస్తుతం భరిణి నటుడిగా బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తోన్న 'పెదకాపు'లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే 'సర్కారు నౌకరి' అనే సినిమాలో నటిస్తున్నారు. కన్నడలో ప్రభుదేవా.. శివరాజ్ కుమార్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు చర్చలు దశలో ఉన్నట్లు తెలుస్తోంది.