శూర్పణక పాత్రలో.. స్టార్ హీరోయిన్ రిస్క్!
రకుల్ శూర్పణఖ పాత్రలో నటంచేందుకు అవకాశం ఉందని, ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని తెలిసింది.
By: Tupaki Desk | 10 Feb 2024 3:30 PM GMTనితీష్ తివారీ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `రామాయణం` ప్రీ-ప్రొడక్షన్ పనిని వేగంగా పూర్తి చేస్తున్నారు. రణబీర్ కపూర్ - సాయి పల్లవి జంట శ్రీరాముడు- సీతగా నటిస్తుండగా, ఇందులో రావణుడిగా యష్ నటిస్తున్నారు. హనుమంతుడి పాత్రలో సన్నీడియోల్ పేరు ఖరారైంది. దశరథుని భార్యలలో ఒకరైన కైకేయి పాత్రలో లారా దత్తా నటించనుందని, విభీషణునిగా నటించేందుకు విజయ్ సేతుపతిని సంప్రదించారని కూడా కథనాలొస్తున్నాయి. ఈ చిత్రం రణబీర్ సహా చాలా మందికి మొదటి పౌరాణిక వెంచర్. ఈ మెగా సినిమాలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశం లభించిందని తెలిసింది. రకుల్ శూర్పణఖ పాత్రలో నటంచేందుకు అవకాశం ఉందని, ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని తెలిసింది.
రకుల్ - నితీష్ తివారీ కొంతకాలంగా చర్చలు జరుపుతున్నారు. శూర్పణఖగా రకుల్ సరిపోతుందని అతడు భావిస్తున్నాడు. రామాయణంలోని అత్యంత ముఖ్యమైన పాత్రలలో ఇది ఒకటి. ఎందుకంటే రాముడు రావణుడిని వెతుకుతూ వెళ్లేందుకు కారకురాలు శూర్పణఖ. తన అన్న రావణుని రెచ్చగొట్టి సీతను లంకకు ఎత్తుకెళ్లిపోయేలా చేసిన కీలక సూత్రధారి. త్వరలోనే రకుల్ సంతకం చేసేందుకు సిద్ధంగా ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. జీవితకాలంలో ఒక్కసారే ఇలాంటి అరుదైన అవకాశం లభిస్తుందని రకుల్ భావిస్తోందని కూడా సమాచారం. రకుల్ పై లుక్ టెస్ట్‌లు చేసినట్లు సమాచారం. అన్నీ సవ్యంగా జరిగితే, నిర్మాత జాకీ భగ్నానితో పెళ్లి తర్వాత రకుల్ కి మొదటి సినిమా షూటింగ్ ఇదే కావచ్చు.
మార్చి 2024లో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువెళ్లేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నందున ప్రీ-ప్రొడక్షన్ .. ప్రిపరేషన్ వర్క్ ప్రారంభమైంది. రామాయణం మొదటి భాగం దీపావళి 2025 వారాంతంలో విడుదల అవుతుంది. మేకర్స్ జూలై 2024 నాటికి సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు, ఆ తర్వాత ఏడాది పొడవునా పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ చేస్తారు.