'కల్కి 2898 AD' గురించి ఇది తెలుసా?
దీనికి తోడు పాన్ ఇండియన్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు స్టార్ ప్రభాస్ ఇందులో నటిస్తున్నారు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది.
By: Tupaki Desk | 5 March 2024 3:40 PM GMTమహాభారత కాలం నుంచి 2898 ఎడి కాలం వరకూ సాగే కథతో 'కల్కి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్. అంటే.. కొన్ని యుగాల గురించిన చర్చ సాగుతుంది. ఆయా కాలాల్లో మారుతున్న టెక్నాలజీ సంస్కృతి గురించి కూడా ఇందులో ప్రస్థావిస్తారు. ఇదంతా తెరపై వీక్షించేందుకు ఒక మహదాద్భుతంగా ఉంటుందని అంచనా. విజువల్ గ్రాఫిక్స్ మాయాజాలంతో చాలా కథను నడిపించవచ్చు. కల్కి పూర్తిగా యూనిక్ పంథాలో సాగే సినిమా అని తొలి నుంచి టీమ్ చెబుతోంది. దీపిక, అమితాబ్ సెట్స్ లో అనుభవాలను చెబుతూ నాగ్ అశ్విన్ థాట్ ప్రాసెస్ గురించి ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
దీనికి తోడు పాన్ ఇండియన్ ఫాలోయింగ్ ఉన్న తెలుగు స్టార్ ప్రభాస్ ఇందులో నటిస్తున్నారు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. 'కల్కి 2898 AD' లో ప్రభాస్ పాత్రను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు నాగ్ అశ్విన్. ఈ భారీ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ప్రస్తుతం ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ప్రభాస్ -దిశా పటాని జంటపై ఒక పాటను చిత్రీకరిస్తున్నట్లు తాజాగా తెలుస్తోంది. మిగిలిన భాగాలను పూర్తి చేయడానికి చిత్రబృందం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది.
ఈ భారీ-బడ్జెట్ చిత్రంలో విశ్వనటుడు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోందని టాక్ ఉంది. ఈ చిత్రం 9 మే 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఆ మేరకు రిలీజ్ తేదీపై అధికారికంగా పోస్టర్లను వైజయంతి సంస్థ విడుదల చేసింది.